ఏపీలో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర... సీఎం జగన్ పై లోకేష్ ట్రోలింగ్

By Arun Kumar PFirst Published Jun 11, 2021, 4:19 PM IST
Highlights

ఏపీలో పెట్రోల్ ధర రూ.100 కు చేరుకున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికన జగన్ ను ట్రోల్ చేశారు లోకేష్. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరిన నేపథ్యంలో సీఎం జగన్ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికన జగన్ ను ట్రోల్ చేశారు లోకేష్.

 

విధ్వంసం-విద్వేషం రెండుక‌ళ్లుగా సాగుతున్న రెండేళ్ల పాల‌న‌లో ధ‌ర‌లు రెండింత‌లు పెరిగాయి.ప్ర‌భుత్వ ట్యాక్స్‌ల‌కు అద‌నంగా జ‌గ‌న్ ట్యాక్స్ తోడ‌వ‌డంతో అన్ని రేట్లూ పెరిగాయి.(1/3) pic.twitter.com/za1pRdKtjr

— Lokesh Nara (@naralokesh)

''సీఎంగా త‌న స్వ‌యంకృషితో వైఎస్ జగన్ ఏపీని ఒక విష‌యంలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలబెట్టారు. జ‌గ‌న్ సాధించిన ఘ‌న‌తేంటో తెలుసుకోవాలంటే ఓ గంట వెయిట్ చేయాలి'' అంటూ లోకేష్ ఓ ట్వీట్ చేశారు. 

read more  రాష్ట్రంలో బాబాయ్ మర్డర్ పై సిబిఐ విచారణ- డిల్లీకి జగన్... మతలబేంటో?: దేవినేని ఉమ

ఆ తర్వాత కొద్దిసేపటికి మరికొన్ని ట్వీట్స్ చేశారు. ''విధ్వంసం-విద్వేషం రెండుక‌ళ్లుగా సాగుతున్న వైఎస్ జగన్ రెండేళ్ల పాల‌న‌లో ధ‌ర‌లు రెండింత‌లు పెరిగాయి. ప్ర‌భుత్వ ట్యాక్స్‌ల‌కు అద‌నంగా జ‌గ‌న్ ట్యాక్స్ తోడ‌వ‌డంతో అన్ని రేట్లూ పెరిగాయి'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''బాదుడురెడ్డి దెబ్బ‌కి పెట్రోల్ ధ‌ర‌ శుక్ర‌వారం ద‌క్షిణాది రాష్ట్రాల‌లో సెంచ‌రీ దాటి (రూ.101.61) నాట‌వుట్‌గా రికార్డులు సృష్టించింది. అభివృద్ధిలో అట్ట‌డుగు స్థానం, కోవిడ్ కేసుల్లో 5వ స్థానానికి ఏపీని చేర్చిన జ‌గ‌న్‌.. పెట్రోల్ ధ‌ర‌ల పెంపులో సౌత్‌లో మ‌న రాష్ట్రాన్ని నెంబ‌ర్‌వ‌న్‌గా నిలిపారు. ఇది జ‌గ‌న్ రెడ్డి పాపం..ప్ర‌జ‌ల‌కు శాపం'' అంటూ సీఎం జగన్ పై  తీవ్ర విమర్శలు గుప్పించారు లోకేష్. 

 
 

click me!