పేదల ఇళ్ల స్ధలాల కొనుగోలులో అవినీతి... హైకోర్టులో పిటిషన్ దాఖలు

By Arun Kumar PFirst Published May 14, 2020, 6:45 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదల ఇళ్లస్థలాల కోసం కొనుగోలు చేసిన భూముల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. 

అమరావతి: పేదల ఇళ్లస్థలాల కోసం జగన్ ప్రభుత్వం కొనుగోలుచేసిన భూముల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ పై గురువారం ఏపి హైకోర్టు విచారణ జరిపింది. తూర్పు గోదావరి జిల్లా బురిగపూడిలో 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఈ భూమి కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. 

ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములను అధిక ధరకు కొనుగోలు చేశారంంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని వైసిపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.  అనంతరం విచారణ వాయిదా వేసింది. 

అర్హత కలిగిని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లపట్టాలు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించారు.  లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు మార్కింగ్‌ చేసి ఇంటిపట్టాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని సీఎం సూచించారు. పట్టాపత్రాన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌తో రూపొందించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి పలురకాల నమూనా పత్రాలను కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి పరిశీలించారు.  

అర్హత ఉండి ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఇళ్లస్థలం ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఇప్పటివరకూ 22,46,139 లబ్ధిదారులను గుర్తించినట్లు అందులో గ్రామీణ ప్రాంతాల్లో 11,77,260 లబ్ధిదారులు, పట్ణణ ప్రాంతాల్లో 10,99,160 లబ్ధిదారులను గుర్తించగా  22,461 భూములు అందుబాటులో ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు.  


  

click me!