ఒక్కరైనా సాయం చేశారా.. అదో జూమ్ పార్టీ: టీడీపీపై బొత్స విసుర్లు

By Siva KodatiFirst Published May 14, 2020, 4:53 PM IST
Highlights

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతుంటే, ఒక్క టీడీపీ నేత కూడా సాయం చేయలేదని బొత్స విమర్శించారు

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతుంటే, ఒక్క టీడీపీ నేత కూడా సాయం చేయలేదని బొత్స విమర్శించారు.

రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ఇప్పుడు జూమ్ పార్టీలా మారిందని, ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో జూమ్ ద్వారా మెసేజ్‌లు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

Also Read:మిషన్ బిల్డ్ ఏపీ కాదు.. జగన్ కిల్డ్ ఏపీ.. లోకేష్ విమర్శలు

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ నియమించామని, నివేదిక వచ్చిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని బొత్స వ్యాఖ్యానించారు. గ్యాస్‌ లీక్ బాధిత గ్రామాల్లోని పరిస్ధితులను సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అన్నారు.

అన్ని శాఖలు వేగంగా స్పందించడం వల్లే నష్టం తగ్గిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో బాధితులందరికీ పరిహారం కూడా అందించామని సత్యనారాయణ తెలిపారు. ఆసుపత్రుల్లో బాధితులందరికీ వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి చెప్పారు.

Also read:ఆ భూములు అమ్మినా...మేం అధికారంలోకి రాగానే లాక్కుంటాం: బోండా హెచ్చరిక

రెండు రోజులుగా బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్ధితి ఉందని, ఎవరికీ సమస్యలు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని.. మరో రెండు రోజుల్లో మిగిలిన బాధితులకు కూడా పరిహారం అందిస్తామని సత్యనారాయణ స్పష్టం చేశారు. 
 

click me!