పవన్ కళ్యాణ్‌ది వీకెండ్ ప్రజాసేవ.. రాజకీయాలకు కూడా ఆలస్యమే: పేర్ని నాని సెటైర్లు

Published : Jul 11, 2022, 02:53 PM ISTUpdated : Jul 11, 2022, 03:11 PM IST
పవన్ కళ్యాణ్‌ది వీకెండ్ ప్రజాసేవ.. రాజకీయాలకు కూడా ఆలస్యమే: పేర్ని నాని సెటైర్లు

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. పవన్‌ కళ్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. పవన్‌ కళ్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం హామీలకు సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా.. చెప్పనవి కూడా సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు.  విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. 

విశ్వసనీయతకు, విలువలకు అద్దం పట్టేలా సీఎం జగన్ పాలన సాగుతుందని పేర్ని నాని చెప్పారు. వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారని అన్నారు. భారీగా వర్షం పడుతున్న కార్యకర్తలు వైసీపీ ప్లీనరీ పాల్గొన్నారని చెప్పారు. అదే సమయంలో పవన్ కకళ్యాణ్‌పై విమర్శలు గుప్రపించారు. పక్షానికి ఒకసారి సెలవు రోజున పవన్ ప్రజా సేవ చేస్తారని ఎద్దేవా చేశారు. పవన్ షూటింగ్‌లకే కాదని.. రాజకీయాలకు కూడా ఆలస్యమేనని విమర్శించారు. పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టడమనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. 

జగన్ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న.. ఆయననే పవన్ కల్యాణ్‌ టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు దాటకుండా చేసింది గాజువాక, భీమవరం ప్రజలని.. దాంతో జగన్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. 

మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీలపై మండిపడ్డారు. మూడు పార్టీలు విష కూటమిలా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని  కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంపై ప్రజలే కూర్చుకున్నారని తెలుసుకుంటే మంచిదని సూచించారు. తెలుగుదేశం పార్టీలో శాశ్వత అధ్యక్షుడనే ప్రతిపాదన పెడితే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఊరుకోరని అన్నారు. హరికృష్ణ,పురందేశ్వరీలను మభ్య పెట్టారు కాబట్టే చంద్రబాబుకు భయం ఉందని విమర్శించారు. వైసీపీకి అలాంటి భయం లేదన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సీఎం జగన్‌ను కోరారని చెప్పారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?