ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని అత్యంత తెలివైన వ్యక్తి : పేర్ని నాని ఆసక్తికర కామెంట్స్

Published : Apr 30, 2023, 01:39 PM IST
ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని అత్యంత తెలివైన వ్యక్తి : పేర్ని నాని ఆసక్తికర కామెంట్స్

సారాంశం

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశంసల వర్షం కురిపించారు. 

గుడివాడ: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశంసల వర్షం కురిపించారు. గుడివాడ బస్సు డిపో ప్రారంభోత్సవంలో ఓ కార్యక్రమంలో  పేర్ని నాని మాట్లాడుతూ.. 151 ఎమ్మెల్యేల్లో కొడాలి నాని పెద్దగా చదువుకోని వ్యక్తిగా కనిపిస్తాడని అన్నారు. పెద్దగా చదువుకోలేదని  కొడాలి నాని చెప్పేవి డ్రామా మాటలని అన్నారు. గడ్డం, రుద్రాక్ష రౌడీ గెటప్ మాదిరిగా కనిపిస్తాయని చెప్పారు. అయితే కొడాలి నాని బుర్ర పాదరసం కంటే వేగంగా పనిచేస్తుందని అన్నారు. 

కొడాలి నానిని ఓడించడానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారని.. నాని నోట్లో కిళ్లీ వేసుకుంటాడని అనుకుంటారని.. అయితే నాని ఐదో సారి కూడా గెలవడానికి స్కెచ్ వేసి ఉంచాడని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయాలలో తాను చూసిన వ్యక్తుల్లో కొడాలి  నాని అంతా తెలివైన వారు లేరని చెప్పారు. రాష్ట్రంలో జనాల గుండెల్లో జగన్ ఎలా  పాతుకుపోయారో.. కొడాలి నాని కూడా గుడివాడ జనాల గుండెల్లో పాతుకుపోయారని అన్నారు. కొడాలి నాని వంటి డైనమిక్ లీడర్ స్నేహితుడిగా దొరకడం అదృష్టమని చెప్పారు. 

అదే కార్యక్రమంలో కొడాలి నాని మాట్లాడుతూ.. 2,300 మంది ఆర్టీసీ కుటుంబాలను చంద్రబాబు గాలికొదిలేసాడని విమర్శించారు. చంద్రబాబు, రజనీకాంత్‌లకు భవిష్యత్తు లేదని అన్నారు. చంద్రబాబు, రజనీకాంత్‌లకు ఆస్పత్రుల చుట్టూ తిరగడంతోనే సరిపోతుందని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు, జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu
CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్| Asianet News Telugu