నెల్లూరు పేరారెడ్డిపల్లి చిన్నారుల నోట్లో కుంకుమతో పూజలు: చిన్నారి పునర్విక మృతి

By narsimha lodeFirst Published Jun 16, 2022, 10:05 AM IST
Highlights


నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లిలో కూతురు నోట్లో కుంకుమ పోసి పూజలు చేసిన ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ  విషయమై పోలీసులు చిన్నారి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆత్మకూరు: Nellore  జిల్లా Atmakur పరిధిలోని Perareddypallyలో విషాదం చోటు చేసుకొంది. కూతురు నోట్లో కుంకుమ పోసి పూజలు చేసిన ఘటనలో అస్వస్థతకు గురైన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

తన ఇద్దరు కవల పిల్లలతో Venugopal  పూజలు చేశాడు. ఇద్దరు పిల్లల నోట్లో కుంకుమ, పసుపు పోసిన  ఘటన  చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. పిల్లల కేకలు విన్న స్థానికులు పూజలు చేస్తున్న వేణుగోపాల్ నుండి పిల్లలను విడిపించారు. కుంకుమను మింగని మూడేళ్ల కూతురు Punarvika గొంతును తండ్రి వేణుగోపాల్ నులిమాడు. దీంతో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది., వెంటనే స్థానికులు ఆ బాలికను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆ బాలికను చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. Chennai లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మరణించింది.

also read:మూడేళ్ల కూతురి ఒంటిమీద పసుపునీళ్లు పోసి, నోటినుండా కుంకుమ పోసి కన్నతండ్రి పూజలు.. ప్రాణాపాయస్థితిలో చిన్నారి..

తమ కుటుంబానికి ఏదో చెడు జరుగుతుందని భావించిన తండ్రి శాంతి పూజలు చేయాలని భావించాడు. పసుపు నీళ్లు పోసి, కుంకుమను చిన్నారుల నోట్లో కుక్కి ఊపిరాకుండా చేశాడు. బుధవారం నాడు ఉదయం తమ  ఇంట్లోని కవల కుమార్తెల్లో పునర్వికను పూజ గదిలో పడుకోబెట్టి పసుపు నీళ్లు పోయించాడు. ఆ తర్వాత నోట్లో కుంకుమ పోయడంతో పునర్వికకు ఊపిరి ఆడలేదు. దీంతో బాలిక కేకలు వేసింది.  స్థానికులు వెంటనే వేణుగోపాల్ ఇంట్లోకి వచ్చి చిన్నారిని ఆసుపత్రికి తరలించారుఈ విషయమై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వేణుగోపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతి సాధించినా కూడా  మూఢ నమ్మకాలతో చిన్నారులతో వేణుగోపాాల్  పూజలు నిర్వహించడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఎంతో సౌమ్యంగా కన్పించే వేణుగోపాల్ ఈ రకమైన పూజలు చేయడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేణుగోపాల్ ఈ రకమైన పూజలు చేయడం తమకు ఆశ్చర్యం కల్గిస్తుందని కూడా వారు మీడియాకు చెప్పారు. ఏనాడూ కూడా వేణుగోపాల్ తనకు ఇబ్బందులున్నట్టుగా కూడా చెప్పలేదని వారు అంటున్నారు.   వేణుగోపాల్ ఈ పూజలు నిర్వహించడం వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వేణుగోపాల్ కు ఈ పూజలు చేయాలని ఎవరు చెప్పారనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

click me!