మూడేళ్ల కూతురి ఒంటిమీద పసుపునీళ్లు పోసి, నోటినుండా కుంకుమ పోసి కన్నతండ్రి పూజలు.. ప్రాణాపాయస్థితిలో చిన్నారి..

By SumaBala BukkaFirst Published Jun 16, 2022, 6:39 AM IST
Highlights

నెల్లూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కుటుంబానికి మంచి జరగాలని.. ఓ తండ్రి మూడేళ్ల కూతురి నోట్లో పసుపు, కుంకుమపోసి మింగమని బలవంత పెట్టాడు. దీంతో ఊపిరాడక ఆ చిన్నారి ప్రాణాపాయస్థితిలోకి వెళ్లింది. 

నెల్లూరు : తమ కుటుంబానికి ఏదో చెడు చుట్టుకుంటుందని... అది పోవాలంటే పూజలు చేయాలి.. అనుకున్న ఓ తండ్రి.. తన కన్న కూతురి ప్రాణాలకు ముప్పు తెచ్చాడు. ఒంటిపై పసుపు నీళ్ళు పోసి, నోటి నిండా కుంకుమ పోసి ఊపిరాడకుండా చేశాడు. దాంతో ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని వీరారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. ప్రొక్లెయిన్ నిర్వహణతో నష్టపోయిన వేణుగోపాల్.. బుధవారం తన  కవల కుమార్తె ల్లో ఒకరైన Punarvika (3)ను  పూజగదిలో పడుకో బెట్టి,  పసుపు నీళ్లు పోశాడు. 

తర్వాత నోట్లో కుంకుమ, పసుపు పోసి మింగమని బలవంత పెట్టాడు. అయితే ఆ పసుపు, కుంకుమలతో ఊపిరి ఆడకపోవడంతో..  బాలిక కేకలు వేసింది. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన భార్య అది చూసి.. గట్టిగా అరిచి, కేకలు వేసి.. సాయం కోసం చుట్టుపక్కల వారిని పిలిచింది. అవి విన్న చుట్టుపక్కల వారు వచ్చి ఆ చిన్నారిని.. మొదట ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి చెన్నైకి తీసుకువెళ్లారు. తాను దేవుడినని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న వేణుగోపాల్ ను బంధువులు బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. వేణుగోపాల్ గత మూడు రోజులుగా ఏవేవో పూజలు చేస్తూనే ఉన్నాడని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. ఆత్మకూరు ఎస్ఐ శివశంకరరావు కేసు నమోదు చేసి వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. 

బొడ్డుతాడు తింటే పిల్లలు పుడతారని మూఢనమ్మకం.. వివాహిత మృతి..

కాగా ఇలాంటి మూఢనమ్మకమే.. నిరుడు డిసెంబర్ లో తంజావూర్ లో జరిగింది. తంజావూరు జిల్లాలో మూఢనమ్మకంతో ఆరు నెలల చిన్నారిని నరబలి ఇచ్చిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే… జిల్లాలోని సేతుపావసత్రం ప్రాంతానికి చెందిన నజ్రుద్దీన్ (32) అనే మత్స్యకారుడికి భార్య  షాలికా (30),  ఇద్దరు కుమారులు, షాజరా  అనే ఆర్నెల్ల కుమార్తె ఉంది. అయితే, రెండు రోజుల క్రితం ఈ చిన్నారి ఇంటిముందు నీళ్ల తొట్టెలో విగతజీవిగా కనిపించింది. ఆ తర్వాత ఆ చిన్నారికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, ఆరునెలల చిన్నారి నీటితోట్టిలో ఎలా పడింది? అన్న సందేహం ఇరుగుపొరుగు వారికి వచ్చింది. ఈ విషయం పేరావూరణి పోలీసులకు చేరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నజ్రుద్దీన్, షాలికా దంపతులను విచారించగా అసలు విషయం వెల్లడైంది, 

నజ్రుద్దీన్ పిన్ని  షర్మిల బేగం (48)  భర్త అజారుద్దీన్  గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు.  దీంతో మంత్రగాడిని సంప్రదించగా నరబలి ఇస్తే అంతా చక్కబడుతుందని సలహా ఇచ్చాడు. దీంతో షాలిక ఆరు నెలల కుమార్తెను  షర్మిల బేగం  నీటి తొట్టెలో పడేసి చంపేసినట్లు  విచారణలో వెల్లడైంది.  అలాగే సమాచారాన్ని పోలీసులకు చెప్పకుండా అంత్యక్రియలు నిర్వహించినందుకు నజ్రుద్దీన్,  ఆయన సోదరుడు  సయ్యద్ ఇబ్రహీం,  షర్మిల బేగం ల ను అదుపులోకి తీసుకున్నారు. 

click me!