Andhra Pradesh Exit Polls Result 2024 : పీపుల్ పల్స్ సర్వేలో టిడిపి సెంచరీ... వైసిపి హాఫ్ సెంచరీకే ఔట్..

Published : Jun 01, 2024, 08:59 PM IST
Andhra Pradesh Exit Polls Result 2024 : పీపుల్ పల్స్ సర్వేలో టిడిపి సెంచరీ... వైసిపి హాఫ్ సెంచరీకే ఔట్..

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో ఈసారి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని అధిక ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. పీపుల్ పల్స్ సర్వే కూడా టిడిపి కూటమికే విజయావకాశాలు వున్నాయంటోంది... ఈ సర్వే ప్రకారం టిడిపి, వైసిపి లకు ఎన్ని సీట్లు వస్తాయంటే... 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, బిజెపి, జనసేన పార్టీల కూటమిదే విజయమని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఈ సంప్థ తాజాగా ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టిడిపి కూటమికి 95-110 వచ్చే అవకాశాలున్నాయట. ఇక వైఎస్ జగన్ సారథ్యంలోని వైసిపి ఈసారి కేవలం 45-60 సీట్లకు మాత్రమే పరిమితం కానుందట. ప్రతిపక్ష కూటమిలో జనసేన పార్టీ 14-20, బిజెపి 2‌-5 సీట్లు సాధిస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.  

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరిగితే నాలుగో విడతలో ఏపీ ఎన్నికలు జరిగాయి. మే 13న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం-జనసేన-బిజెపి  కూటమి మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది.  

ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో రికార్డుస్థాయిలో ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పల్లెలతో పాటు పట్టణ ఓటర్లు కూడా పోలింగ్ బూత్ కు కదలి రావడంతో అర్థరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇలా ఓటేయడానికి ప్రజలు పోటెత్తడం ఎవరికి లాభిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో పీపుల్స్ పల్స్ సర్వే టిడిపి కూటమికే విజయావకాశాలు ఎక్కువని తేల్చింది. 

అయితే ఏపీలో పోలింగ్ ముగిసిన నాటినుండి ఫలితాలపై చర్చ మొదలైంది. తమ పార్టీదే గెలుపంటే తమదే గెలుపని అటు వైసిపి, ఇటు టిడిపి కూటమి నాయకులు చెబుతున్నారు. ప్రజలు కూడా ఎవరి పక్షాన నిలిచారో అంతుచిక్కడం లేదు. దీంతో ఇవాళ తుది దశ లోక్ సభ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి.  వీటిని తెలుగు ప్రజలే కాదు అభ్యర్థులు, పార్టీ పెద్దలు ఆసక్తిగా గమనిస్తున్నారు.  


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Reddy Fires On Gudiwada Amarnath | Asianet News Telugu
School Holidays 2026-27 : ఈ అకడమిక్ ఇయర్ లో 87 రోజులు సెలవులే.. తెలుగు స్టూడెంట్స్ కి ఏ నెలలో ఎన్ని సెలవులు?