Andhra Pradesh Exit Polls 2024 : బిగ్ టివి సర్వేలో టిడిపిదే విజయం ... జిల్లాలవారిగా ఎవరికెన్ని సీట్లంటే...

Published : Jun 01, 2024, 08:35 PM ISTUpdated : Jun 01, 2024, 08:36 PM IST
Andhra Pradesh Exit Polls 2024 : బిగ్ టివి సర్వేలో టిడిపిదే విజయం ... జిల్లాలవారిగా ఎవరికెన్ని సీట్లంటే...

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ అధికార వైసిపిని ప్రతిపక్ష టిడిపి కూటమి ఓడిస్తుందని బిగ్ టివి ఎగ్జిట్ పోల్ పలితాలు చెబుతున్నాయి. చివరకు సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ వైసిపితో సమానంగా టిడిపికి సీట్లు వస్తాయట. ఈ సర్వే ప్రకారం జిల్లాల వారిగా ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే... 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి విజయకేతనం ఎగరేస్తుందని బిగ్ టివి ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చాయి. రాష్ట్రంలని 175 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి,జనసేన, బిజెపి కూటమి 106-119 సీట్లు సాధించే అవకాశం వుందని ప్రకటించారు.  ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించనన్ని సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన వైసిపికి ఈసారి పరాభవం తప్పదట... వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కేవలం 56-69 సీట్లు మాత్రమే వస్తాయని బిగ్ టీవీ ప్రకటించింది. 

ఇక ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లోనూ టిడిపి కూటమికి 17-18 వస్తాయని... వైసిపి కేవలం 7-8 చోట్ల మాత్రమే గెలుస్తుందని తేల్చింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయం ఏమిటంటే వైఎెస్ జగన్ సొంత జిల్లా కడపలోనూ వైసిపితో టిడిపి హోరాహోరీగా తలపడిందని... ఇరు పార్టీలకు సమానంగా సీట్లు వస్తాయని బిగ్ టీవి సర్వే చెబుతోంది.  
 
బిగ్ టీవి సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలవారిగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు : 

శ్రీకాకుళంలో వైసిపికి 2-3, టిడిపి కూటమికి 7-8 సీట్లు 

విజయనగరం వైసిపికి 4-5, టిడిపి కూటమికి 4-5 సీట్లు 

విశాఖపట్నంలో వైసిపికి 5-6, టిడిపి కూటమికి 9-10 

తూర్పు గోదావరి జిల్లాలో వైసిపికి 4-5, టిడిపి కూటమికి 14-15 సీట్లు  
 
పశ్చిమ గోదావరి జిల్లాలో వైసిపికి 4-5, టిడిపి కూటమికి 10-11 సీట్లు 

కృష్ణా జిల్లాలో వైసిపికి 6-7,  టిడిపి కూటమికి 9-10 సీట్లు 

గుంటూరులో వైసిపికి  5-6, టిడిపి కూటమికి 11-12 సీట్లు  

ప్రకాశం జిల్లాలో వైసిపికి 4-5, టిడిపి కూటమికి 7-8 సీట్లు  

నెల్లూరులో జిల్లాలో వైసిపికి 3-4, టిడిపి కూటమికి 6-7 సీట్లు 

చిత్తూరు జిల్లాలో వైసిపికి 4-5, టిడిపి కూటమికి 9-10 సీట్లు

అనంతపురం జిల్లాలో వైసిపికి 5-6,  టిడిపి కూటమికి 8-9 సీట్లు

కడప జిల్లాలో వైసిపికి 5-6, టిడిపి కూటమికి 4‌-5 సీట్లు 

కర్నూల్ జిల్లాలో వైసిపికి 5-6, కూటమికి 8-9 సీట్లు   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్