‘‘ పంచాయతీ ’’ నాటి పగ : వైసీపీ అభ్యర్ధి ఓటమి.. ఓటు వేయలేదంటూ పెన్షన్ కట్

By Siva KodatiFirst Published Mar 2, 2021, 5:20 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయాలు కొనసాగుతున్నాయి. పార్టీల మధ్య వైరం .. పంచాయతీలు, పెన్షన్ లబ్ధిదారులకు శాపంగా మారింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో సామాజిక పెన్షన్‌లు నిలిపివేయడం సంచలనం రేపింది

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయాలు కొనసాగుతున్నాయి. పార్టీల మధ్య వైరం .. పంచాయతీలు, పెన్షన్ లబ్ధిదారులకు శాపంగా మారింది.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో సామాజిక పెన్షన్‌లు నిలిపివేయడం సంచలనం రేపింది. పమిడిపాడు పంచాయతీ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి స్వల్ప అభ్యర్ధి ఆధిక్యంతో విజయం సాధించారు.

దీంతో తమకు ఎన్నికల్లో కొందరు ఓటు వేయలేదని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు కక్స పెంచుకుని వృద్ధులు, వితంతవులకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీడీవోకి బాధితులు ఫిర్యాదు చేశారు. కాగా, ఎంపీడీవో మాత్రం 650 మందికి గాను 625 మందికి పెన్షన్ అందించినట్లు చెప్పారు.

కొంతమంది వాలంటీర్లు పెన్షన్ దారుల నుంచి బయోమెట్రిక్ వేలిముద్రలు తీసుకుని కూడా పెన్షన్ ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. దీనిపై అందిన ఫిర్యాదులపై విచారణ  జరిపి అందరికీ పెన్షన్ అందిస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. 

click me!