నకిలీ మందుల రాకెట్: మెడికల్ షాపులపై ఏపీ సర్కార్ కొరడా

Siva Kodati |  
Published : Mar 02, 2021, 04:37 PM ISTUpdated : Mar 02, 2021, 04:38 PM IST
నకిలీ మందుల రాకెట్: మెడికల్ షాపులపై ఏపీ సర్కార్ కొరడా

సారాంశం

నకిలీ మందుల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో నకిలీ మందుల విక్రయాలకు కారకుల ఆటకట్టించేందుకు ఔషధ నియంత్రణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ , పోలీసులు రంగంలోకి దిగారు

నకిలీ మందుల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో నకిలీ మందుల విక్రయాలకు కారకుల ఆటకట్టించేందుకు ఔషధ నియంత్రణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ , పోలీసులు రంగంలోకి దిగారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ షాపులు, హోల్ సేల్ షాపులపై తనిఖీలు ముమ్మరం చేయాలని డ్రగ్స్ ఐజీకి మంత్రి ఆళ్ల నాని ఆదేశాలిచ్చారు. విజయవాడ కేంద్రంగా నకిలీ మందులు విక్రయాలు చేస్తున్న ఓ ఫార్మా సంస్థ ఏజెన్సీని అధికారులు సీజ్ చేశారు.

మరోవైపు ఛండీగఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా నడుస్తోన్న రాకెట్‌లో కీలక వ్యక్తల కోసంప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నకిలీ మందుల వ్యవహారం ఇటీవల భీమవరంలో బయటపడటంతో దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నకిలీ మందుల విక్రయాలు ఎక్కడ జరిగినా ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం