జగన్ తో ప్రాణభయముంది: జెసి ప్రభాకర్ రెడ్డి

First Published Mar 4, 2017, 1:17 PM IST
Highlights

అనంతపురం సాక్షి కార్యాలయం ముందు జెసి ప్రభాకర్ రెడ్డి ధర్నా

వైకాపా అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రాణభయం ఉందని తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

 

 ఈరోజు ఆయన అనంతపురం లోని సాక్షి పత్రికా కార్యాలయం ముందు ధర్నా చేశారు. కృష్ణా జిల్లా ముళ్ల పాడు వద్ద ఆయన కుటుంబానికి చెందిన జెసి ట్రావెల్స్ బస్సుకు జరిగిన ప్రమాదం మీద జగన్ యుద్ధంప్రకటించడానికి నిరసనగా ఆయన ఈ రోజు ఈ ధర్నా చేశారు.

 

ప్రతిపక్ష నాయకుడు జగన్ కు పిచ్చిపట్టింది, అది కూడా సిఎం కావాలనే పిచ్చిఅని చెబుతూ తమను (జెసి బ్రదర్స్) ను చంపేస్తాడేలా వున్నాడని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 

జగన్ కలెక్టర్‌, ఎస్పీలను బెదిరిస్తున్నారని బెదిరించడం విచిత్రం అని వ్యాఖ్యానించారు.

 

చావుల విషయంలో రాజకీయాలు వద్దు అని, దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదం వూహించింది కాదని చెబుతూ మృతుల కుటుంబాలకు ఏమైనా చేద్దామన్న ఆలోచన మానేసి చావులను రాజకీయం చేయడం

 

సబబు కాదని ఆయన అన్నారు. "జగనేమిటో మాకు బాగా తెలుసు. ఆయన పుట్టినప్పట్నుంచి చూస్తూనే ఉన్నాం. నా కొడుకులు కార్లలో స్కూళ్లకు వెళుతున్నప్పుడు జగన్‌‌కు కారు కూడా లేదన్నారు. మా నాయన  1952 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అప్పట్నుంచి మేం ఎన్నికోట్లు సంపాదించుండాలి.మా సంపాదనే  ఇది. ఎమ్మెల్యేను అయినా కాక పోయినా ఇదేవృత్తి" అని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. జగన్ సెంట్రల్ జైలు భాషకు అభ్యంతరం చెబుతూ ,‘అందరిని సెంట్రల్ జైలుకు పంపుతా అని రోజూ బెదిరకు పోతా.  నోరు తెరిస్తే సీఎం అవుతా , సిఎం అవుతా అంటావ్. 2019 తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం,’  అని ఆయన అన్నారు.

 

 

click me!