నిజంగానే పాలన అదుపు తప్పిందా?

First Published Apr 27, 2017, 4:43 AM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-భాజపాల పొత్తుపై అనుమానంగానే ఉంది. ఎందుకంటే, కొంతకాలంగా మౌనంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలందరూ మెల్లిగా చంద్రబాబు ప్రభుత్వంపై బాహాటంగానే ఆరోపణలు చేస్తుండటమే కారణం.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-భాజపాల పొత్తుపై అనుమానంగానే ఉంది. ఎందుకంటే, కొంతకాలంగా మౌనంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలందరూ మెల్లిగా చంద్రబాబు ప్రభుత్వంపై బాహాటంగానే ఆరోపణలు చేస్తుండటమే కారణం. వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కలిసే పోటీ చేయాలని ఇటీవల జరిగిన ఎన్డీఏ సమావేశంలో నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అయితే,  తర్వాత జరుగుతున్న పరిణామాలే పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

అలా వార్తలు వస్తున్న సందర్భంలోనే భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టంగా ప్రకటించారు. పురంధేశ్వరి కూడా తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందనే చెబుతున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే భాజపా ఎంఎల్సీ సోము వీర్రాజు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తటం గమనార్హం. రాష్ట్రంలో పాలన అదుపుతప్పిందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటంతో రైతుల పరిస్ధితి దయనీయంగా తయారైందన్నారు. బెంగుళూరు తదితర ప్రాంతాలకు ఇసుక అక్రమ రావాణా చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట్లు ఆరోపించారు.

మార్కెట్లో కిలో బియ్యం ధర చాలా ఎక్కువగా ఉన్నపుడు వరి పండించే రైతులకు మాత్రం ఎందుకు గిట్టుబాటు ధరలు రావటం లేదని ప్రశ్నించటంలో తప్పేమీ లేదుకదా? రాష్ట్రంలో పరిపాలన అదుపుతప్పటం వల్లే ఇలా జరుగుతోందని కూడా వీర్రాజు తీర్మానించేసారు.

 

click me!