కేంద్రానికి పనవ్ తీవ్రమయిన హెచ్చరిక

Published : Apr 23, 2017, 11:14 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
కేంద్రానికి పనవ్ తీవ్రమయిన హెచ్చరిక

సారాంశం

కేంద్ర ధోరణి మానుకోక పోతే వేర్పాటు ఉద్యమాలొస్తాయి, జాగ్రత్త

ఉపజాతీయ ఉద్యమాలను రెచ్చగొట్టవద్దు అని జనసేన నాయకుడు పవనకల్యాణ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

 

" సాంస్కృతిక, భాష, జాతీయ వైవిధ్యం నిండా ఉన్న భారత్ వంటి దేశాలలో  ఉన్న ఉపజాతీయ గుర్తింపును కేంద్రం గౌరవించక పోతే, వేర్పాటు ఉద్యమాలకు నారు పోస్తున్నట్లే లేక్క,’ అనరి పవన్ తీవ్రమయిన వాఖ్య చేశారు. 

 

ఈ వ్యాఖ్యను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

 

చాలా కాలంగా పవన్ దక్షిణాది వివక్షను లేవనెత్తుతున్నారు.

 

కేవలం దక్షిణాది వాల్ల ఢిల్లీలో గొంతు లేనందునే ఢిల్లీ ప్రభుత్వం వివక్ష చూపుతూ ఉందని, అందుకే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నది ఆయన ఆరోపణ.

ఇపుడు తాజాగా బలవంతంగా దక్షిణాదిరాష్ట్రాల  మీద హిందీ రుద్దే ప్రయత్నాన్ని కూడా పవన్ వ్యతిరేకిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఆయన కేంద్రానికి ఈ హెచ్చరిక చేశారు.

 

కేంద్రం చూపిస్తున్న  తెలుగు, తమిళం, మలయాళం వంటి ఉపజాతీయ గుర్తింపును గౌరవించడం లేదని అందుకే, ఈ రాష్ట్రాలవారితో కలసి ఒక దక్షిణ భారత సాంస్కృతిక కూటమి ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

 

దీనికి పలువురు కళాకారులు, ఇతర  సాంస్కృతిక రంగ ప్రముఖునుంచి మద్దతు వస్తున్నదని తెలిసింది.

 

ఆయన దక్షిణ భారత ఆత్మగౌరవం ప్రాతిపదిన రాజకీయాలు సమీకరణ చేయాలనుకుంటున్నారు. 

 

ఇలాంటి ప్రయత్నం జరగడం  ఇదే మొదలు.

 

తమిళనాడులో గతంలో వచ్చిన హిందీవ్యతిరేక ఉద్యమాలేవీ తమిళనాడు దాాటి రాలేదు. ఇతర దక్షిణ భారత తమిళేతర ప్రజలను ప్రభావితం చేయలేదు.

 

ఇపుడు పవన్ అఖిల దక్షిణ భారత దేశ దిశలో యోచిస్తున్నట్లు తెలిసింది.

 

ఇదే ప్రజాగాయకుడు  గద్దర్ ను ఆయనను సన్నిహితంచేస్తున్నది కూడా  అదే  అని చెబుతున్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu