ఏర్పేడుచావులన్నీ ప్రభుత్వం హత్యలే : జగన్

Published : Apr 23, 2017, 09:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఏర్పేడుచావులన్నీ ప్రభుత్వం హత్యలే : జగన్

సారాంశం

ఏర్పేడు ఇసుక దందా గురించి చేసిన ఫిర్యాదులను ఎమ్మార్వో,పోలీసులు పట్టించుకోలేదు, కారణం, మాఫియా వెనక ప్రభుత్వ పెద్దలున్నారు

 

ఏర్పేడు ఘటనలో ఈ 17 మంది ప్రాణాలు తీసింది ఇసుక మాఫియానేనని ఇవి సర్కారీ హత్యలేనని  ప్రతిపక్ష నాయకుడువైయస్.జగన్ స్పష్టం చేశారు.

 

ఈ రోజు ఆయన ఏర్పేడ్ లో ఒక ట్రక్కు కింద నలిగిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.

 

అనంతపురం  విలేకరులతో మాట్లాడుతూ  ఇక్కడి పేద రైతుల మృతికి కారణమయిన ఇసుక దందాకు తెలుగుదేశంప్రభుత్వం,పార్టీ అండదండలున్నాయని ఆరోపించారు.

 

‘ఆరు నెలల క్రితం కమ్యూనిస్టు నేత సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్వయంగా 600 లారీలు, ట్రాక్టర్లను జేసీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది అంతా చూశారు.  కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలో 8 చోట్ల, జిల్లాల్లో మరో 100 చోట్ల ఇసుక మాఫియా రెచ్చిపోతోంది,’ ఆయన అన్నారు.

 

 ’ఇసుక మాఫియా వెనుక ఎవరున్నారో కూడా అందరికి తెలుసు. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడు అనే టీడీపీ నేతల పేర్లను గ్రామస్తులంతా  చెబుతున్నారు, వారిమీద ఫిర్యాదు చేశారు. అయినా  ఎందుకు అధికారులు పట్టించుకోవటం లేదు,’ని ఆయన జగన్ ప్రశ్నించారు.

 

ఎమ్మార్వో, పోలీసుల దగ్గరకి వెళ్లిఫిర్యాదుచేసినా  పట్టించుకోవటం లేదని అంటూ . ఎమ్మార్వోని కలుద్దామని వెళ్తే.. ఆయన ఎపుడూ అందుబాటులో ఉండడట. పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే.. స్టేషన్ గేట్ మూసేసి రావొద్దంటారట.  17 మంది  మొన్న చనిపోయేందుకు ఇదే పరిస్థితి కారణం,’ అని ఆయన ఆరోపించారు.

 

ధనుంజయ నాయుడు,  చిరంజీవి నాయుడుల మీద  ఎందుకు కేసులు వేయలేదో ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాలని అడిగారు.

 

 స్వర్ణముఖి నదీతీరాన ఉండి కూడా ఈ గ్రామంలో నీళ్ల కోసం కటకటలాడాల్సిన పరిస్థితికి కారణం ఇసుకు మాఫియేనని ఆరోపిస్తూ ఇసుక ఫ్రీ అంటున్న చంద్రబాబు నాయుడు ఇసుక దందాకు అండగా నిలిచి వాటి నుంచి డబ్బు సంపాదించుకోవచ్చుకునేందుకు కొందరికి మార్గంచూపించారని అన్నారు.

 

 ’అధికారుల దగ్గర నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు దోచుకుంటున్నారు. ఎటు చూసినా ఏది ముట్టుకున్నా.. అంతా అవినీతే,’ అని విమర్శించారు.

 

జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలని బాధితులకు ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

ఒకవేళ ఆపకపోతే ఇంత కన్నా తీవ్రంగా వైయస్ఆర్ సీపీ పోరాటాలతో స్పందిస్తుందని  జగన్ హెచ్చరించారు.

 

ఈ సందర్భంగా మోహన నాయుడు అనే  రైతు నాయకుడు కల్పించుకొని మాట్లాడుతూ.. ఒక్క టీవీలో  కూడా  చిరంజీవి నాయుడు, ధనుంజయ నాయుడు పేరు రాలేదని, ఇలా ఎందుకు ఆ పేర్లను దాస్తున్నారో చెప్పాలని  అడిగారు.

 

‘తెలుగుదేశం వాళ్ల లారీ తప్ప ఎవరైనా ఇసుక ఎత్తితే వాళ్ల లారీ పోలీస్ స్టేషన్ లో ఉంటోంది. మరి, మీడియా మిత్రులు ఈ పేర్లు నిన్నటి నుంచి ఎందుకు రానీయలేదో చెప్పాల,’ అని మోహన్ నాయుడు అన్నారు.

PREV
click me!

Recommended Stories

MLA Viral Video: ఎమ్మెల్యే రాస‌లీలలు.? ఈ వీడియోలో ఉంది నిజంగానే జ‌న‌సేన నాయ‌కుడా.?
IMD Rain Alert : కేరళ తీరంలో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో వర్షాలు