రావెలను సస్పెన్స్ లో పెట్టిన పవన్

By ramya neerukondaFirst Published Jan 28, 2019, 11:22 AM IST
Highlights

అధికారంలో ఉన్న టీడీపీ ని కాదని మరీ జనసేనలో చేరారు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో వారు ఉన్నారు.


అధికారంలో ఉన్న టీడీపీ ని కాదని మరీ జనసేనలో చేరారు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో వారు ఉన్నారు.అంతేకాదు.. జనసేనలో తనకు టికెట్ దక్కుందనే నమ్మకం కూడా రావెలలో ఉంది. కానీ.. ఆ విషయంలో పవన్ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు.

తాజాగా గుంటూరు జిల్లాలో జిల్లాలో జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అధికారికంగా ప్రకటించారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ పేరును, తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ స్పీకర్‌, పార్టీ రాష్ట్ర నేత నాదెండ్ల మనోహర్‌ పేరును ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు కూడా జిల్లా నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలియజేసినా ఆయన ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేదీ వెల్లడించలేదు. 

రావెల కచ్చితంగా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో పవన్ తేల్చకపోవడంతో.. రావెల అభిమానుల్లో కలరవం మొదలైంది. అసలు టికెట్ ఇచ్చే ఉద్దేశాలు ఉన్నాయా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

click me!