మేం పాచిపోయిన లడ్డూ అంటే తిట్టారు: బాబుపై పవన్ కల్యాణ్

First Published Jul 20, 2018, 8:29 PM IST
Highlights

అవిశ్వాస తీర్మానంపై లోకసభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో వరుసగా తన వ్యాఖ్యలను పోస్టు చేస్తున్నారు. ప్రతి దశలోనూ టీడీపి ప్రత్యేక హోదాపై బిజెపితో కుమ్మక్కయి, రాజీ పడిందని ఆయన వ్యాఖ్యానించారు. 

అమరావతి:  అవిశ్వాస తీర్మానంపై లోకసభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో వరుసగా తన వ్యాఖ్యలను పోస్టు చేస్తున్నారు. ప్రతి దశలోనూ టీడీపి ప్రత్యేక హోదాపై బిజెపితో కుమ్మక్కయి, రాజీ పడిందని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇప్పుడు కంటితుడుపు చర్యగా ఏదో చేస్తున్నారని ఆయన అన్నారు.  ప్రజలను మభ్యపెట్టడానికి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాల కోసం టీడీపి ప్రత్యేక హోదాపై రాజీ పడిందని ఆయన అన్నారు. టీడీపి నేతలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. ఎపి ప్రజల విశ్వాసాన్ని చూరగొనే గొప్ప అవకాశాన్ని టీడీపి జారవిడుచుకుందని అన్నారు. 

ఎపి ప్రజలు టీడీపి నాయలకు ఎలా కనిపిస్తున్నారని అడుగుతూ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని గ్రహించి కొత్తగా వచ్చిన జనసేన పార్టీ రెండున్నరేళ్ల క్రితం చెప్పినప్పుడు బిజెపిని వెనకేసుకొచ్చారని ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. అందరూ గగ్గోలు పెడుతున్నా గానీ పాచిపోయిన లడ్డులాంటి ప్రత్యేక ప్యాకేజీని కళ్లకద్దుకుని తీసుకుని తమను తిట్టి అనుభవరాహిత్యమని విమర్శలు చేసినవారు ఈ రోజున జరిగిన మోసం తెలుసుకోవడానికి ఇన్ని ఏళ్లు పట్టిందంటే నమ్మాలా అని ఆయన అన్నారు. 


"రాజనాథ్ సింగ్ గారి మాటలు ... ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే అంటం “ చూస్తుంటే..  టీడీపీ - బీజేపీ ఇంకా కలిసి ఉన్నాయని స్పష్టమౌతుంది. ఇద్దరు కలిపి ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు అనిపిస్తుంది" అని పవన్ కల్యాణ్ అన్నారు.

"ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి,ఇప్పుడే  పుట్టిన పాలుగారే పసిపిల్లల లాగా... కేంద్రం చేత మోసగింపపడ్డాం ..అంటే, ప్రజలు నమ్ముతారు .. అని టీడీపీ నాయకులు ఎలా అనుకుంటారు?" అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 

 

AP ప్రజలు’ - టీడీపీ నాయకులకి ఎలా కనిపిస్తున్నారు? pic.twitter.com/kfZysCJ4qO

— Pawan Kalyan (@PawanKalyan)
click me!