
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరకున్న చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా సీఎం కుటుంబసభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం చేసి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మాణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు.
మూల నక్షత్రం, ఆదివారం కలిసి రావడంతో భక్తులు దుర్గమ్మ దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వారిని నియంత్రించడం పోలీసుల తరం కావడం లేదు. ఈ రోజును అమ్మవారు మహా సరస్వతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.