విశాఖలో ఉద్రిక్తత: పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఆందోళన, రంగంలోకి పోలీసులు

By narsimha lodeFirst Published Oct 16, 2022, 9:48 AM IST
Highlights

aవిశాఖపట్టణంలోని పోర్టు కళావాణి వద్ద ఆదివారం నాడు ఆందోళనకు దిగారు.  విశాఖలో రాజధానికి పవన్ కళ్యాణ్ అనుకూలమో, సిద్దమో చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు.

విశాఖపట్టణం: విశాఖపట్టణం పోర్టు కళావాణి వద్ద  ఆదివారంనాడు  ఉదయం ఉద్రిక్తత  చోటు చేసుకుంది.విశాఖపట్టణంలోపవన్ కళ్యాణ్  పర్యటనను నిరసిస్తూ  ఆందోళనకారులు నిరసనకు దిగారు.విశాఖపట్టణంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను నిన్న సాయంత్రం విశాఖపట్టణానికి వచ్చారు.  విశాఖపట్టణంలోని ఓ హోటల్‌లో పవన్ కళ్యాణ్ బసచేశారు.ఇదే హోటల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్, నాగబాబులు కూడ ఉన్నారు. పవన్ కళ్యాణ్  బస చేసిన హోటల్ లో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ గది ఉన్న ఫ్లోర్ లో అన్ని రూమ్ లను పోలీసులు తనిఖీలు చేశారు.

నిన్న విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఏపీ మంత్రుల  వాహనాలపై జనసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆందోళనకారులు తప్పుబట్టారు. జనసేన, అభిమానుల పేరుతో  మంత్రులపై దాడి చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వకుండా విశాఖలో ఎందుకు అడుగు పెట్టారో చెప్పాలని ఆందోళనకారులు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విశాఖలో  రాజధానితో పాటు మూడు రాజధానులకు పవన్ కళ్యాణ్ అనుకూలమో కాదో చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ని కోరారు.

విశాఖపట్టణంలో  మూడు రాజధానులకు అనుకూలంగా నిన్న విశాఖ గర్జనను జేఏసీ నిర్వహించింది. ఈ గర్జనకు వైసీపీ సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది.ఈ కార్యక్రమానికి వస్తున్న మంత్రుల కారుపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు.అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన ప్రకటించింది. విశాఖలో మూడు రోజుల  పర్యటనకు పవన్ కళ్యాణ్  నిన్నవచ్చారు. విశాఖపట్టణం,విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల నాయకులతో పవన్ కళ్యాణ్  సమావేశంకానున్నారు. జనవాణి  కార్యక్రమంలో పాల్గొంటారు. విశాఖగర్జన నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన నిర్వహిస్తున్నారని వైసీపీ విమర్శలుచేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు రాజధానుల అంశాన్నితెరమీదికి తెచ్చింది. విపక్షాలన్నీ కూడా అమరావతిలోనే  రాజధానినికి కొనసాగించాలని డిమాండ్  చేస్తున్నాయి.మూడు రాజధానుల అంశాన్ని విపక్షపార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి

click me!