ఎపీ నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటన

By telugu teamFirst Published Nov 30, 2020, 7:14 PM IST
Highlights

నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. క్షేత్రస్ఖాయిలో తుఫాను బాధితుల కడగండ్లను తెలుసుకోవడానికి పవన్ కల్యాణ్ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు.

అమరావతి: నివర్ తుపాన్ మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి... వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడుతున్నారు. 2వ తేదీ నుంచి పర్యటనలు మొదలవుతాయి. 

ఆ రోజు ఉదయం 9 గం.30ని.లకు ఆయన ఉయ్యూరు చేరుకుంటారు. అక్కడి నుంచి పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలకు వెళ్తారు. ఆయా ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడి రైతులను కలిసి వారి బాధలను తెలుసుకొంటారు. పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు చేరుతారు. భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటిస్తారు. 

పవన్ కల్యాణ్ 3వ తేదీన తిరుపతి చేరుకొంటారు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న నష్టాలపై జనసేన నాయకులతో చర్చిస్తారు. 4వ తేదీన శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని కలుస్తారు. అక్కడి నుంచి నాయుడుపేట, గూడూరుల్లో పర్యటించి నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు. 

నివర్ ప్రభావిత జిల్లాల జనసేన నాయకుల నుంచి ఆదివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ గారు క్షేత్ర స్థాయి సమాచారాన్ని తెలుసుకున్నారు. రైతాంగం కడగండ్లను నాయకులు వివరించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి రైతులతో స్వయంగా మాట్లాడాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు

click me!