
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి తన బస్సు యాత్రను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయన గురువారం విశాఖలో పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు.
ఈ సమావేశంలో జనసేన వ్యూహకర్త దేవ్ కూడా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఆయన తన బస్సు యాత్రను ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. సమావేశంలో రోడ్ మ్యాప్ ను ఖరారు చేస్తారని అంటున్నారు.
గురువారం సాయంత్రం పవన్ కల్యాణ్ బస్సు యాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన బస్సు యాత్రపై ఆయనే స్వయంగా ప్రకటన చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.
శ్రీవారిని దర్శించుకని చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకుని అక్కడ బస చేశారు.