గాజు గ్లాస్ కాకుండా.. మరో రెండు గుర్తులు ఈసీకి పంపిన పవన్

By ramya neerukondaFirst Published Dec 25, 2018, 1:14 PM IST
Highlights

ఈ గాజు గ్లాసు కాకుండా.. మరో రెండు గుర్తులను కూడా పవన్.. ఎన్నికల సంఘానికి పంపారట. మొత్తం మూడు గుర్తులను పంపగా.. అందులో గాజు గ్లాసు ని ఎన్నికల సంఘం ఒకే చేసిందని  ఆ పార్టీ సమన్వయ కర్త రంజిత్ కుమార్ తెలిపారు.

జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసుని ఎన్నికల సంఘం గుర్తించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా.. ఈ గాజు గ్లాసు కాకుండా.. మరో రెండు గుర్తులను కూడా పవన్.. ఎన్నికల సంఘానికి పంపారట. మొత్తం మూడు గుర్తులను పంపగా.. అందులో గాజు గ్లాసు ని ఎన్నికల సంఘం ఒకే చేసిందని  ఆ పార్టీ సమన్వయ కర్త రంజిత్ కుమార్ తెలిపారు.

ప్రజలు జనసేన పార్టీ  గుర్తును సులభంగా గుర్తించుకునేలా పవన్ కళ్యాణ్.. పడికిలి, గాజు గ్లాసు, బకెట్ గుర్తులను జాతీయ ఎన్నికల  సంఘానికి పంపారని రంజిత్ కుమార్ చెప్పారు.  పార్టీ ప్రాధాన్యతను గుర్తించిన ఎన్నికల కమిషనర్ రెండో ప్రాధాన్యత గుర్తు అయిన గాజు గ్లాసును పార్టీ కేటాయించారని తెలిపారు. గాజు గ్లాసుని కేటాయించడం పట్ల పవన్ హర్షం వ్యక్తం చేశారని వివరించారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం పుట్టిన పార్టీనే తమ జనసేన పార్టీ అన్నారు. గాజు గ్లాసు తమ పార్టీ గుర్తుగా కేటాయించడంతో ఇప్పటి నుంచే  ఇతర రాజకీయ పార్టీల వారికి ఓటమి టెన్షన్ మొదలైందన్నారు. 

click me!