హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్

Published : Dec 25, 2018, 12:17 PM ISTUpdated : Dec 25, 2018, 01:24 PM IST
హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్

సారాంశం

హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టులను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహిళలేకావడం అందులోనూ సొంత అక్కచెళ్లెల్లే కావడం విశేషం. వీరంతా విశాఖ మన్యంలో పోలీసులపై దాడి చేసిన ఘటనల్లో నిందితులు కావడం విశేషం. మావోయిస్టులు అనూష , అన్నపూర్ణ , భవానిలను మౌలాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుషాయిగూడలో అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్: హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టులను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహిళలేకావడం అందులోనూ సొంత అక్కచెళ్లెల్లే కావడం విశేషం. వీరంతా విశాఖ మన్యంలో పోలీసులపై దాడి చేసిన ఘటనల్లో నిందితులు కావడం విశేషం. మావోయిస్టులు అనూష , అన్నపూర్ణ , భవానిలను మౌలాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుషాయిగూడలో అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ముగ్గురు అక్క చెళ్లెల్లు ఉండటం గమనార్హం. అయితే వీరంతా మావోయిస్టు అగ్రనేత ఆర్కే అడుగుజాడల్లో నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యువతను మావోయిజం వైపు ఆకర్షించేందుకు జరగుతున్న ప్రయత్నాలు తెలుసుకోవడంతో సోమవారం రాత్రి పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు.

వీరితోపాటు మిలీషియన్ సభ్యుడు పలు హత్యల్లో నిందితుడు అయిన కొర్రా కామేశ్వరరావును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మెుత్తం నలుగురు మావోయిస్టులను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్