అప్పు ఇస్తానంటే చంద్రబాబు ఏనుగైనా కొంటారు: పవన్ కల్యాణ్ పంచ్

First Published Jun 7, 2018, 8:25 PM IST
Highlights

స్వయంగా మంత్రి అయ్యన పాత్రుడు చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

విశాఖ: స్వయంగా మంత్రి అయ్యన పాత్రుడు చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.  తెలుగుదేశం పార్టీలో కబ్జాకోరులున్నారని స్వయంగా మంత్రి అయ్యన్నపాత్రుడే అంటున్నారని, దానికి చంద్రబాబు ఏం జవాబిస్తారని అన్నారు.

గత నాలుగేళ్లలో ఉత్తరాంధ్రలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని అయన అన్నారు. చంద్రబాబు పాలనలో అందరికీ అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా నర్సీపట్నంలో జరిగిన సభలో పవన్‌ కల్యాణ్ గురువారం ప్రసంగించారు. 

ప్రజలను మోసం చేస్తారని తెలియక చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మన్యం ఖనిజ సంపదను ప్రభుత్వం దోచుకుంటోందని, చంద్రబాబు దత్తత గ్రామంలో కనీసం మంచినీరు కూడా స్వచ్ఛంగా లేవని అన్నారు. గిరిజన యువకులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వేస్తుంటే ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారని ఆయన చంద్రబాబును అడిగారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. 

అప్పు ఇస్తానంటే చంద్రబాబు ఏనుగైనా కొంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఇసుక, మైనింగ్‌ మాఫియాలో రాష్ట్రం ముందంజలో దూసుకుపోతోందని విమర్శించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఉద్దేశించిన రూ. 300 కోట్ల నిధులను టీడీపీ నేతలు మింగేశారని, టీడీపీ పాలనంతా అవినీతిమయమని  అన్నారు.

వేయి ఓట్లు కూడా రాని ప్రాంతాల్లో టీడీపీని గత ఎన్నికల్లో గెలిపించామని అన్నారు. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు లేక యువకులు గంజాయి రవాణాకు కూడా సిద్ధపడుతున్నారని అన్నారు. వడ్డాదిలో విచ్చలవిడిగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

click me!