జగన్ తో రమణదీక్షితులు భేటీపై చంద్రబాబు రియాక్షన్ ఇదీ..

First Published Jun 7, 2018, 7:17 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుమల మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు భేటీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుమల మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు భేటీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే తనకేమిటి సంబంధమని ఆయన ప్రశ్నించారు.

జగన్‌ను రమణదీక్షితులు కలిశారని, మరో కుట్రకు పథకం రచిస్తున్నారని అన్ారు. తిరుమల పవిత్రతను ఎవరు దెబ్బతీసినా సహించబోమని ఆయన హెచ్చరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (టీటీడీని) కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవాలని చూసిందని, చివరికి దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.  

చిత్తూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి రమణదీక్షితులు జగన్ ను కలిసిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు చేరవేశారు. అయితే భేటీని నిర్ధారించిన తర్వాత తనకు చెప్పాలని టీడీపీ శ్రేణులను ఆయన ఆదేశించారు.
 
అన్యమతస్థుడైన జగన్‌ను రమణ దీక్షితులు కలవాల్సిన అవసరం ఏమిటని టీడీపీ నేత ముళ్లపూడి రేణుక ప్రశ్నించారు. జగన్‌, రమణదీక్షితుల డైరెక్షన్‌లోనే విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, బీజేపీ డ్రామాలో నటులు జగన్‌, రమణదీక్షితులు అని ముళ్లపూడి రేణుక దుయ్యబట్టారు.

click me!