Pawan Kalyan: అమరావతి రైతులు ధర్మ యుద్ధంలో గెలిచారు: ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

Published : May 02, 2025, 04:38 PM IST
Pawan Kalyan: అమరావతి రైతులు ధర్మ యుద్ధంలో గెలిచారు: ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

సారాంశం

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజ‌రైన అమ‌రావ‌తి పునఃనిర్మాణ కార్య‌క్రమంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి కోసం భూములు ఇచ్చిన రైతుల‌కు ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా కృతజ్ఞ‌తలు తెలిపారు. అమ‌రావ‌తి రైతులు ధ‌ర్మ యుద్ధంలో గెలిచార‌న్నారు. ప‌వ‌న్ ఇంకా ఏం మాట్లాడ‌రంటే..   

అమ‌రావ‌తి రైతులు గత ఐదేళ్లుగా అలుపెర‌గ‌ని పోరాటం చేశార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌లెఇపారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని తాము మాటిచ్చామ‌ని, అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నామ‌న్నారు. అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాల భూములు ఇచ్చార‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. 

గత ఐదేళ్లుగా రాజధాని ప్రాంత రైతులు నలిగిపోయారన్న ప‌వ‌న్ రాజధాని రైతుల పోరాటం మరువలేనిద‌న్నారు. 
గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్‌ను తుడిచిపెట్టేసింద‌ని ప‌వ‌న్ విమ‌ర్శించారు. అమరావతి రైతులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. 

లాఠీదెబ్బలు, ముళ్లకంచెల మధ్య రైతులు ఇబ్బంది ప‌డ్డార‌న్న ప‌వ‌న్ ఇచ్చిన మాటకు కట్టుబడి.. అమరావతి పనులు నిధులు కేటాయించిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రైతుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.

కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతదేశాన్ని కలచివేసిందన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇంత ఇబ్బందుల్లో కూడా ప్రధాని ఇక్కడికి రావడం ఏపీ ప్రజల అదృష్టం అన్నారు. అమరావతి రైతుల త్యాగాలను ప్రధాని గుర్తించారని చెప్పుకొచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Local Body Elections 2026 : మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు... ఎక్కడ, ఎవరికి అవకాశమో తెలుసా?
Rice: డీమార్ట్ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం