కోటి ఖర్చు చేస్తా, మీరు వెయ్యి పెట్టగలరా: మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ విసుర్లు

By narsimha lodeFirst Published Feb 1, 2020, 6:38 PM IST
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


విజయవాడ:ఇష్టమైనా వాళ్లే తనతో ఉండాలని, ఇష్టం లేని వాళ్లు పార్టీని వీడి వెళ్లొచ్చని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.. ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేరో కూడ తెలియదని  పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

శనివారం నాడు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేసిన సమయంలో చేసిన విమర్శలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. 

Also read:రాజీనామా ఆమోదం: జేడీ లక్ష్మినారాయణపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు

నిబద్దతతోనే తాను సినిమాలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్ని సినిమాలు తాను చేయనని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ పోయి దెబ్బతిని కూడ పార్టీ పెట్టినట్టుగా ఆయన చెప్పారు.

తన మాదిరిగా ఆలోచించే కొత్త తరం ఉంటుందని అదే ఉద్దేశ్యంతో  తాను పార్టీని ఏర్పాటు చేసినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్నీ ఆలోచించిన తర్వాతే పార్టీని  ఏర్పాటు చేసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.

నిన్న కూడ ఓకాయన పార్టీకి రాజీనామా చేశారని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.ఇష్టంతోనే  పార్టీలో ఉండమంటున్నాను, బలవంతంగా ఎవరిని కూడ తనతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకోవడం లేదని పవన్ కళ్యాణ్  పరోక్షంగా జేడీ లక్ష్మీనారాయణ పేరును ప్రస్తావించకుండా ఆయనపై విమర్శలు గుప్పించారు. 

భావజాలం ఇద్దరిని కలపాలి,  భావజాలం కలపకపోతే మనుషులు విడిపోతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక లక్ష్యం సాధించాలంటే నీ పద్దతి నచ్చడం లేదని  వెళ్లిపోతానంటే అభ్యంతరం లేదన్నారు.

తాను పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఇవాళ రాజీనామాలు చేసిన వారెవరూ కూడ తన పక్కన లేరని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మీరే నా వెంటే  ఉన్నారని కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.

మీరు తిడితే  నేను భయపడుతానని ఆయన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నాకు అండగా నిలబడిన వాళ్లు విమర్శిస్తే  ఆ విమర్శలను తాను తీసుకొంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

తనను వాడుకొని , ఆఖరి నిమిషాల్లో వచ్చి  మీ పద్దతి బాగా లేదని విమర్శిస్తే తాను సహించనని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను ఎప్పుడైనా మార్కెటింగ్ చేశానా  అంటూ వంగ్యాస్త్రాలు సంధించారు.

తనకు ఉన్న మార్కెట్‌ను వదిలేసి తాను రాజకీయాల్లొకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.  తాము సంపాదించుకొన్న దానిలో పార్టీ కోసం కొంత ఖర్చు చేస్తున్న వాళ్లకు తాను అర్ధం అవుతున్నానని, కానీ జనసేనను ముడిసరుకుగా వాడి  ఎదగాలని భావించేవాళ్లకు తాను అర్ధం కావడం లేదన్నారు పవన్. 

దెబ్బతిని వచ్చినవాడిని, చాలా చిన్న కుటంబం నుండి వచ్చినవాడిని, చాలా చిన్నస్థాయి నుండి వచ్చినవాడినని ఆయన చెప్పారు. రెండు చోట్ల ఓటమి పాలయ్యాను. రాత్రికి రాత్రే పార్టీ నిర్మాణం జరగదని  పవన్ కళ్యాణ్ చెప్పారు.

మనుషులను విడదీయటం చాలా తేలీక, కలపడం చాలా కష్టమని పవన్ అభిప్రాయపడ్డారు.  నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరడానికి రెండేళ్లుగా పలు అంశాలపై చర్చించినట్టుగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొన్నారు.

పార్టీలో చేరడానికి మూడు రోజుల ముందు కూడ అనేక అంశాలపై  మాట్లాడిన తర్వాతే  నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరారని ఆయన గుర్తు చేశారు.కష్టపడి కోటి రూపాయాలు సంపాదించి ఇవ్వండి అని  పవన్ కళ్యాణ్ పరోక్షంగా  జేడీ లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారు. కోటి రూపాయాలు  కాదు  వెయ్యి రూపాయాలు సంపాదించి ఇవ్వాలన్నారు.

యువత, మహిళలు తనను అర్ధం చేసుకొన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా మానవత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.

పార్టీ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం పార్టీ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించినట్టుగా ఆయన తెలిపారు.ఃజనసేన  పార్టీ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. 

మీరు ఇష్టంతో నాతో ఉండాలన్నారు. రేపు 10 ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే వారిని కాపాడుకోవడం కోసం తాను ప్రయత్నించనని చెప్పారు. ఆ ఎమ్మెల్యేలను  కాపాడుకోవడం కోసం తాయిలాలు ఇవ్వనని చెప్పారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పార్టీ చేరారని పవన్ కళ్యాణ్ చెప్పారు. భయాలు, ఇతర అవసరాల కోసం మీరు పార్టీని వీడితే తనకు అభ్యంతరం లేదన్నారు.

పార్టీ భావజాలం నచ్చినవారే పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ భావజాలం నచ్చిన వారే పార్టీలో కొనసాగుతారన్నారు. కొత్త ఎమ్మెల్యేలను ఎలా తెచ్చుకోవాలో తనకు తెలుసునని ఆయన చెప్పారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని చెప్పారు. అధికారం కోసం ఒకరి మోచేతి నీళ్లు తాగానన్నారు. రాజకీయాల్లో ఓపిక చాలా అవసరమన్నారు. రాజకీయాల్లో ఓపిక ఉన్నవారికి విజయం వరిస్తోందన్నారు.

రాజకీయాల నుండి డబ్బులు తీసుకోవడం తనకు చేతకాదన్నారు. సినిమాల నుండి వచ్చిన ఆదాయాన్ని తన మీద ఆధారపడిన వారి కోసం ఖర్చు చేస్తానని చెప్పారు.ఒక్క ఛాన్స్ అని తాను ప్రజలను మోసం చేయలేదని పరోక్షంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు. 

click me!