యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్రగా ప్రకటించి.. 25 రాజధానులు చేసేయండి: జగన్ సర్కార్‌పై పవన్ వ్యంగ్యాస్త్రాలు

Published : Oct 11, 2022, 12:52 PM IST
యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్రగా ప్రకటించి.. 25 రాజధానులు చేసేయండి: జగన్ సర్కార్‌పై పవన్ వ్యంగ్యాస్త్రాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వికేంద్రీకరణ అనేది సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే.. ఏపీకి మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి? అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రీకరణకు మద్దతు పేరుతో ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈ నెల 15న  విశాఖ గర్జన పేరిట తలపెట్టిన భారీ ర్యాలీని ఉద్దేశించి.. దేనికి గర్జనలు? అంటూ వైసీపీ సర్కార్‌పై పవన్ ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా వికేంద్రీకరణపై మరోమారు జగన్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. 

వికేంద్రీకరణ అనేది సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే.. ఏపీకి మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి? అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఏపీని ‘‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర’’ ప్రకటించాలని సెటైర్లు వేశారు. ‘‘25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి.. 25 రాజధానులకు వెళ్లండి. ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి. దయచేసి సంకోచించకండి.. ఫ్రీగా ఫీల్ అవ్వండి’’ అని పవన్ ట్వీట్ చేశారు. 

‘‘ఏది ఏమైనప్పటికీ వైసీపీ నేతలు.. చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారని,  ప్రవర్తిస్తారు. మిగిలిన పౌరులు ఏమి భావిస్తున్నారో, ఏం చెబుతున్నారో ఒక్క పైసా కూడా పట్టించుకోరు’’ అని వైసీపీ నాయకులపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.  

 


మరోవైపు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలోని దక్షిణ డకోటాలోని ‘‘మౌంట్‌ రష్‌మోర్’’ ఫొటోను షేర్ చేసిన పవన్ కల్యాణ్.. అది ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకి చిహ్నం అని పేర్కొన్నారు.  ‘‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర’’  విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ “మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌’’..  ధన - వర్గ - కులస్వామ్యానికి చిహ్నం.. పీఎస్‌ (బూతులకి కూడా…) అంటూ పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త