
విజయవాడ:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విజయవాడలోని పటమట ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ గృహ ప్రవేశం చేశారు. అమరావతి సమీపంలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం పూర్తయ్యే వరకు ఈ ఇంటి నుండే పవన్ కళ్యాణ్ తన కార్యక్రమాలను కొనసాగించనున్నారు.
విజయవాడలో అద్దె ఇంట్లో వపన్ కళ్యాణ్ గృహ ప్రవేశం చేశారు.పవన్ దంపతులు అద్దె గృహంలో శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడలోని పటమట ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అద్దెకు ఉంటున్న ప్రాంతంలో పోలీసులు నిఘాను తీవ్రం చేశారు. వపన్ ఇంటి చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో బందోబస్తును పెంచారు. పవన్ అద్దె ఇంట్లో ఉన్నంత సేపు ఈ ప్రాంతంలో పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. అంతేకాదు ఈ ప్రాంతంలో 24 గంటల పాటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.