దేశం పేరు మార్పు దిశగా కేంద్రం!.. భారత్‌పై పవన్ ప్రసంగం ఓల్డ్ వీడియో వైరల్..!!

Published : Sep 05, 2023, 05:18 PM IST
దేశం పేరు మార్పు దిశగా కేంద్రం!.. భారత్‌పై పవన్ ప్రసంగం ఓల్డ్ వీడియో వైరల్..!!

సారాంశం

ఇండియా పేరును భారత్‌గా మార్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇండియా పేరును భారత్‌గా మార్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది మన దేశం జీ20కి అతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి జీ20 సభ్య దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే వారి కోసం ఈ నెల 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం.. ఆంగ్లంలోనూ ఇండియాగా ఉన్నా దేశ పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం జోరందుకుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు మార్పుకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రవేశపెట్టనున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అయితే ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఆ ప్రసంగంలో ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరని.. భారతదేశం అని మనదని పవన్ పేర్కొన్నారు. 

 

ఆ వీడియో నేపథ్యం పరిశీలిస్తే.. చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి ప్రీ రిలీజ్‌ఈవెంట్‌కు హాజరైన పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్య పోరాటయోధులు, గొప్పతనం గురించి వివరించారు. ‘‘భారతజాతి మనది.. ఇండియా అనేది బ్రిటీష్ వాళ్లు పెట్టిన పేరు.. భారతదేశం అనేది మనది’’ అని పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం