స్పీడ్ పెంచిన పవన్.. మంగళగిరిలో కీలక సమావేశాలు

Published : Nov 17, 2020, 11:08 AM IST
స్పీడ్ పెంచిన పవన్.. మంగళగిరిలో కీలక సమావేశాలు

సారాంశం

రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో వివిధ జిల్లాల నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల పై సమీక్ష జరపున్నారు.  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కాగా.. సినిమాలో బిజీగా ఉంటూనే రాజకీయంగా స్పీడప్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన మంగళగిరిలో పర్యటిస్తున్నారు.  రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో వివిధ జిల్లాల నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల పై సమీక్ష జరపున్నారు.

మధ్యాహ్నం మూడు గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో భేటీ అవ్వనున్నారు. బుధవారం తేదీ ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో  పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఆ తర్వాత 32 నియోజకవర్గాల నేతలతో సమావేశం అయ్యి.. పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై సూచనలు చేస్తారు.

ఏపీలో జనసేన పార్టీ పరిస్థితులపై ముఖ్య నాయకులు నివేదికల రూపంలో ఇచ్చారు. దీంతో ఇప్పటికే సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న పవన్.. రాజకీయ కార్యక్రమాలకు కూడా సమయం కేటాయించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. రాజధాని పై జేఏసీ నేతలకు పవన్ ఎలాంటి భరోసానిస్తారోనని ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీ భవిష్యత్‌ కార్యచరణ గురించి పవన్ ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి..

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్