ఢిల్లీకి పవన్‌కళ్యాణ్:రేపు బీజేపీ అగ్రనేతలతో భేటీ

By narsimha lodeFirst Published Nov 23, 2020, 7:03 PM IST
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఢిల్లీకి బయలుదేరారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. పవన్  కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.


హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఢిల్లీకి బయలుదేరారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. పవన్  కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ నెల 17, 18 తేదీల్లో గుంటూరులోని మంగళగిరిలో పార్టీ నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్    సమావేశమయ్యారు. అమరావతి జేఏసీ నేతలతో పాటు, అమరావతి మహిళా జేఏసీ నేతలతో కూడా ఆయన సమావేశమయ్యారు.

అమరావతి నుండి రాజధానిని తరలిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమరావతి రైతులకు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. మరో వైపు తెలంగాణలో బీజేపీ, జనసేనల మధ్య కూడ పొత్తు కుదిరింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతును ప్రకటించింది. అంతేకాదు రానున్న ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి.తెలంగాణలో కూడా  బీజేపీతో పొత్తు విషయమై  జనసేనాని ఆ పార్టీ అగ్రనే్తలతో చర్చించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడ సాగుతోంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  జనసేన అభ్యర్ధులను కూడా ఆ పార్టీ ఉపసంహరించుకోవాలని కోరింది.

click me!