ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,62,758కి చేరిక

Published : Nov 23, 2020, 05:53 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,62,758కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 62వేల 758 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 62వేల 758 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 10 మంది కరోనా మరణించారు. కరోనాతో కృష్ణాలో, విశాఖపట్టణం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూల్ , నెల్లూరు, పశ్చిమగోదావరిలలో ఒక్కరి చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు  మరణించినవారి సంఖ్య 6,948కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 96లక్షల 62వేల 220 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  గత 24 గంటల్లో 47,130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీరిలో 0545మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో1390 మంది కరోనా నుండి కోలుకొన్నారు.

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 42వేల 416 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 13,394  యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 019,చిత్తూరులో 032,తూర్పుగోదావరిలో 104, గుంటూరులో 117, కడపలో 031 కృష్ణాలో 044, కర్నూల్ లో 010, నెల్లూరులో 030, ప్రకాశంలో 025, శ్రీకాకుళంలో 019, విశాఖపట్టణంలో 021 విజయనగరంలో 017,పశ్చిమగోదావరిలో 076కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,493, మరణాలు 587
చిత్తూరు  -83,126,మరణాలు 822
తూర్పుగోదావరి -1,21,728, మరణాలు 633
గుంటూరు  -72,178, మరణాలు 645
కడప  -54,077,మరణాలు 448
కృష్ణా  -44,521, మరణాలు 624
కర్నూల్  -60,085, మరణాలు 485
నెల్లూరు -61,171, మరణాలు 494
ప్రకాశం -61,290,మరణాలు 577
శ్రీకాకుళం -45,326, మరణాలు 346
విశాఖపట్టణం  -57,727, మరణాలు 534
విజయనగరం  -40,490,మరణాలు 234
పశ్చిమగోదావరి -91,651, మరణాలు 519

 

 

PREV
click me!

Recommended Stories

Anganwadi Workers on Chandrababu:జీతాలుపెంచకపోతే ప్రాణాలు తీసుకోవడానికి సిద్దం | Asianet News Telugu
ధర్నాలతో సమస్యలు పరిస్కారం కావు: Gummadi Sandhyarani on Anganwadi Workers | Asianet News Telugu