ఆ విమర్శలకు సమాధానాలిస్తా: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పవన్ ఆహ్వానం

By narsimha lode  |  First Published Mar 13, 2022, 3:43 PM IST

ఆవిర్భావ దినోత్సవంలో అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనున్నట్టుగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గుంటూరు జిల్లా ఇప్పటూరులో రేపు జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు హాజరు కావాలని పనన్ కళ్యాణ్  ఇవాళ వీడియో సందేశం విడుదల చేశారు. 
 


అమరావతి: ఇప్పటివరకు ఏపీలో YCP పాలనతో పాటు రానున్న రోజుల్లో Jana Sena ఏం చేయబోతోందనే అంశాలపై రేపు నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రకటన చేయనున్నట్టుగా  ఆ పార్టీ చీప్ Pawan kalyanప్రకటించారు.

జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు mangalagiri  సమీపంలోని ఇప్పటం గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. ఈ సభకు అందరూ ఆహ్వానితులేనంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు వీడియో సందేశం ఇచ్చారు. 

Latest Videos

రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా  సభకు ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని ఆ పార్టీ ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఏపీ భవిష్యత్తు కోసం జనసేన దిశా నిర్ధేశం చేయనుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.దీన్ని తాము జనసేన ఆవిర్భావ దినోత్సవంగా చూడడం లేదన్నారు. ఏపీ దిశా నిర్ధేశాన్ని చూసే సభగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

జనసేనపై చేసిన విమర్శలకు తాము ఈ సభా వేదికగా సమాధానం చెప్పనున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తమపై వచ్చిన విమర్శలకు కూడా సమధానాలను చెబుతామని పవన్ కళ్యాణ్ వివరించారు.
తెలుగు ప్రజల ఐక్యత, ఏపీ అభివృద్ది కోసం అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. ఈ సభా ప్రాంగణానికి తనకు ఇష్టమైన దామోదరం సంజీవయ్య పేరు పెట్టినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. దామోదరం సంజీవయ్య స్పూర్తితోనే తన ప్రసంగం కొనసాగుతుందని చెప్పారు.

ఈ సభకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే హాజరు కావాలని ఆయన జనసైనికులను కోరారు. సభా ప్రాంగణానికి జాగ్రత్తగా వచ్చి వెళ్లాలని కూడా ఆయన కోరారు.

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు Hyderabad హైటెక్స్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం చేశారు.

ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో TDP కి పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై BJP తీసుకొన్న ప్రత్యేక ప్యాకేజీపై కూడా పవన్ కళ్యాణ్ విరుచుకు పడ్డారు.

2019 ఎన్నికల్లో Left పార్టీలతో కలిసి జనసేన పోటీ చేసింది.ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యాడు. విజయం సాధించిన ఒక్క జనసేన ఎమ్మెల్యే కూడా వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నాడు.2019 ఎన్నికల తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తు పెట్టుకొన్నాడు.  

click me!