గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలి: పవన్

Published : May 12, 2019, 03:21 PM IST
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలి: పవన్

సారాంశం

ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  పోటీ చేసిన అభ్యర్థులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఆదివారం నాడు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

గుంటూరు: ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  పోటీ చేసిన అభ్యర్థులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఆదివారం నాడు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

భవిష్యత్‌లో పార్టీ ఏ రకమైన కార్యాచరణ తీసుకొనే విషయమై పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చర్చించారు. గత నెల 11వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల విజయావకాశాలపై పవన్ చర్చించారు. 

స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని  ఆయన పార్టీ శ్రేణులను కోరారు.గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలపై నేతలు దృష్టిని సారించాలని ఆయన పార్టీ నేతలను కోరారు. 

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఎన్నికల్లో తమకు ఏ రకమైన అనుభవాలు వచ్చాయో కూడ కొందరు నేతలు  పవన్ దృష్టికి తీసుకొచ్చారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : కేవలం నాల్రోజులే సంక్రాంతి హాలిడేస్.. కానీ 11 సెలవులు ఎక్స్ట్రా
IMD Rain Alert : హిందూ మహాసముద్రంలో మరో తుపాను .. అక్కడ కుండపోత వర్షాలు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి..?