ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు అనుమానాస్పద మృతి

Published : May 12, 2019, 05:26 PM IST
ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు అనుమానాస్పద మృతి

సారాంశం

చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన అవినాష్ రెడ్డి ఒంగోలు పట్టణంలోని గోపాలపురంలోని ఇంటి ముందు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ప్రేమ వ్యవహారం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు అనుమానిస్తున్నారు.

ఒంగోలు: చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన అవినాష్ రెడ్డి ఒంగోలు పట్టణంలోని గోపాలపురంలోని ఇంటి ముందు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ప్రేమ వ్యవహారం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు అనుమానిస్తున్నారు.

తిరుపతికి చెందిన అవినాష్ రెడ్డి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అవినాష్ రెడ్డికి ఒంగోలు పట్టణానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిచినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

యువతి  ఫోన్ చేస్తే కుటుంబసభ్యులకు చెప్పకుండానే  ఒంగోలుకు అవినాష్ రెడ్డి వచ్చినట్టుగా ఆయన కుటుంబసభ్యులు చెప్పారు.  అవినాష్ రెడ్డి ప్రియురాలి ఇంటి ఎదుట శనివారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. 

దీంతో అవినాష్ రెడ్డి మృతదేహాంతో కుటుంబసభ్యులు ప్రియురాలి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలని  బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : కేవలం ఐద్రోజులే సంక్రాంతి హాలిడేస్.. కానీ 11 సెలవులు ఎక్స్ట్రా
IMD Rain Alert : హిందూ మహాసముద్రంలో మరో తుపాను .. అక్కడ కుండపోత వర్షాలు.. తెలుగు రాష్ట్రాల సంగతేంటి..?