కోనసీమ జిల్లాలో చర్చి ఫాదర్ అసభ్య ప్రవర్తన.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళలు..

Published : Sep 18, 2022, 02:14 PM ISTUpdated : Sep 18, 2022, 03:24 PM IST
 కోనసీమ జిల్లాలో చర్చి ఫాదర్ అసభ్య ప్రవర్తన.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళలు..

సారాంశం

బీఆర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో ఓ చర్చి ఫాదర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. రోమన్ కాథలిక్ చర్చి ఫాదర్ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని పలువురు మహిళలు ఆరోపించారు. 

బీఆర్ అంబేడ్కర్ కొనసీమ జిల్లాలో ఓ చర్చి ఫాదర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. రోమన్ కాథలిక్ చర్చి ఫాదర్ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని పలువురు మహిళలు ఆరోపించారు. వివరాలు.. ముమ్మడివరంలోని రోమన్ కాథలిక్ చర్చి ఫాదర్ రాజు దైవ సందేశం పేరుతో ప్రార్థనలు నిర్వహిస్తూ మహిళలను వేధిస్తున్నాడు. రాజు వేధింపులు శృతిమించడంతో  మహిళలు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా రాజు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు.  అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

రాజును చర్చి నుంచి తొలగించాలని.. ఇతర చర్చిల్లో కూడా ఉండకూడ చూడాలని మహిళలు కోరారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చర్చి ఫాదర్‌ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్