బిజెపిలో జనసేన పార్టీ విలీనమవుతుందా....?: పవన్ కల్యాణ్ సమాధానమిదే

By Arun Kumar PFirst Published Jan 22, 2020, 11:30 PM IST
Highlights

జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్ పై ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బిజెపి తో ప్రస్తుతం పొత్తు పెట్టుకున్న పార్టీ విలీనమయ్యే అవకాశాలున్నాయా అన్న ఓ విలేకరి ప్రశ్నకు పవన్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. 

డిల్లీ: బిజెపిలో జనసేన పార్టీ విలీనమవుతుందా....? అన్న ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన సమాధానం  చెప్పారు. .జనసేన పార్టీని ఏపార్టీలో విలీనం చేయబోమని... అసలు విలీననమే ప్రస్తావనే తేవద్దన్నారు. ఇలాంటి ప్రశ్నలు  మరోసారి వేయకూడదంటూ పవన్  అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము క్లియర్ గా బిజెపి, జనసేనల మధ్య పొత్తు వుంటుందని ప్రకటించామని... ఈ విషయంలో అయోమయం సృష్టించవద్దని పవన్ సూచించారు. 

డిల్లీలో బిజెపి నాయకులతో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, రాజకీయ సలహాదారు నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై  వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రస్తుతం రాష్ట్రంలో, అమరావతిలో నెలకొన్న పరిస్థితులపై వీరు చర్చించి ఓ ఐక్యకార్యాచరణ రూపొందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

అమరావతి కోసం భారీ కవాతు... సంయుక్త కార్యాచరణ ప్రకటించిన బిజెపి, జనసేన

మొదట బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఏపి రాజధాని కోసం బిజెపి, జనసేనలు ఇకపై కలిసి పోరాడనున్నాయని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశం అవుతుందన్నారు. 

అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... రాజధానిపై జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిబ్రవరి 2వ తేధీన బిజెపి, జనసేన పార్టీలు సంయుక్తంగా భారీ కవాతు చేపట్టునున్నట్లు ప్రకటించారు. ప్రకాశం బ్యారేజ్ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఈ కవాతు నిర్వహించాలని ఇరు పార్టీల నిర్ణయించినట్లు తెలిపారు. పిబ్రవరి 2న మద్యాహ్నం రెండు గంటల నుండి కవాతు  ప్రారంభం కానున్నట్లు నాయకులు వెల్లడించారు. 

అమరావతి కోసం ఒక్కటైన బిజెపి, జనసేన... పవన్ డిల్లీ పర్యటన (ఫోటోలు)

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి   నిర్మల సీతారామన్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.  అనంతరం బిజెపి రాష్ట్ర  అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఇంచార్జి సునీల్ దేవధార్, ఎంపి జి.వి.ఎల్.నరసింహరావు, కేంద్ర మాజీ మంత్రి  దగ్గుబాటి పురందేశ్వరిలతో సమావేశమై ఏపి పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. 

click me!