వంద శాతం రుణాల మాఫీ... రైతుల‌కి పదేళ్లు ప‌రిహార భృతి: పవన్ కళ్యాణ్

By Arun Kumar PFirst Published Oct 22, 2018, 5:57 PM IST
Highlights

తిత్లీ తుపాను బాధితుల  తరపున జనసేన పార్టీ పోరాటం చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. న‌ష్ట ప‌రిహారం సాధించేందుకు బాధిత గ్రామాల ప్ర‌జ‌లంతా క‌ల‌సిక‌ట్టుగా నిల‌బ‌డాల‌ని ఆయన గారు సూచించారు. ముఖ్యంగా ఈ తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్రజలకు వంద శాతం రుణ‌మాఫీ చేయడంతో పాటు 10 ఏళ్ల పాటు రైతుల‌కి ప‌రిహార భృతి ఇవ్వాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ భృతి ఎంత మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేయాలో నిర్ణయించడానికి పార్టీలో చర్చిచడంతో పాటు వ్య‌క్తిగ‌తంగా చాలా మందితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నట్లు పవన్ తెలిపారు. 
 
సోమ‌వారం విశాఖ‌ప‌ట్నంలో తిత్లీ తుపాను బాధిత గ్రామాల ప్రతినిధులతో పవన్ స‌మావేశమయ్యారు.  ఆయా గ్రామాల్లో జరుగుతున్న పున‌రావాస చర్యలపై ఆరా తీశారు. అనంత‌రం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ... తుపాను బాధితుల‌కి  జనసేన పార్టీ  అన్ని విధాలా అండ‌గా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అయితే వ్యక్తిగతంగా కూడా ఎవ‌రి స్థాయిలో వారు అంతా క‌ల‌సి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.  

భయంకరమైన తిత్లీ తుపాను వల్ల ఏపికి జరిగిన న‌ష్టంపై జ‌న‌సేన పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఓ నివేదిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని పవన్ అన్నారు.  

అలాగే ఈ తుపాను కార‌ణంగా బాగా న‌ష్ట‌పోయిన గ్రామాల‌ని ద‌త్త‌త తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో బాగా దెబ్బ‌తిన్న గ్రామాల వివ‌రాలు తమకు తెలియ‌చేయాని ప్రజలకు సూచించారు. ఈ తుపాను వల్ల ఎంత న‌ష్టం జరిగింతో ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌డం లేదని...అందువల్లే ఆ వివరాలను సేకరించాల్సిన బాధ్యత ప్రజలే తీసుకోవాలని సూచించారు. 

 ఈ సమావేశంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తో పాటు  నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. తాము ప‌రిహారం కోసం ప్ర‌శ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నార‌నీ, ఎమ్మెల్యేలు కులం పేరుతో దూషిస్తున్నార‌ంటూ పలు విషయాలను బాధిత ప్రజలు పవన్ కళ్యాణ్ కు వివరించారు.    

click me!