మే నాటికి పోలవరం నుంచి నీరందిస్తాం:చంద్రబాబు

By Nagaraju TFirst Published Oct 22, 2018, 4:30 PM IST
Highlights

తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. గత కొంతకాలంగా ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులు పరిశీలించి సూచనలు సలహాలు చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. 

పోలవరం: తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. గత కొంతకాలంగా ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులు పరిశీలించి సూచనలు సలహాలు చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. 

ప్రాజెక్టు స్పిల్‌వే, లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ పనులను చంద్రబాబు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 59.6శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఈనెల 24 నాటికి లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌంటింగ్‌ పనులు పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్‌ నుంచి గేట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. 

రూ.9,870 కోట్లకు సంబంధించి కేంద్రానికి నివేదికలు ఇచ్చామని కేంద్రం నిధులు విడుదల చెయ్యాల్సి ఉందన్నారు. కృష్ణా డెల్టాకు ఈ సీజన్‌లో 73 టీఎంసీల నీరు మళ్లించినట్లు తెలిపారు. వచ్చే మే నాటికి పోలవరం కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరందిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

నదుల అనుసంధానం ద్వారా పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. నీటి భద్రత అనేది ప్రభుత్వ విధానమని, పట్టిసీమ రాకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయేదన్నారు. తిత్లీ తుఫాను సహాయక చర్యల్లో కొందరు ఇబ్బంది పెట్టారని ఆరోపించిన చంద్రబాబు బాధితులకు అన్నిరకాల ఆర్థికసాయం సత్వరమే అందించామని బాబు చెప్పారు.

click me!