అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం: పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

Published : Jan 03, 2024, 03:10 PM IST
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం:  పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

సారాంశం

అయోధ్యలో  రామ మందిర ప్రారంభోత్సవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది.

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ కు   అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి  ఆహ్వానం అందింది. బుధవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో  పవన్ కళ్యాణ్ కు ఆర్.ఎస్.ఎస్. ప్రాంత సంపర్క ప్రముఖ్  ముళ్లపూడి జగన్  ఆహ్వాన పత్రిక అందించారు.

ఈ భేటీలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ  శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్  పూర్ణ ప్రజ్ఞ. ఆహ్వాన పత్రిక అందించి అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలు తెలిపారు.ఈ నెల 22న  రామ మందిర ఆలయంలో ప్రాణ ప్రతిష్ట జరగనుంది.ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం