కాంగ్రెస్‌లోకి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే: వై.ఎస్. షర్మిల వెంట ఆళ్ల రామకృష్ణా రెడ్డి

Published : Jan 03, 2024, 01:44 PM IST
 కాంగ్రెస్‌లోకి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే: వై.ఎస్. షర్మిల వెంట ఆళ్ల రామకృష్ణా రెడ్డి

సారాంశం

వై.ఎస్. షర్మిలతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నడవనున్నారు.  ఆళ్ల రామకృష్ణా రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 


అమరావతి: వై.ఎస్. షర్మిలతో  కాంగ్రెస్ లో చేరుతున్నానని  మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణా రెడ్డి చెప్పారు.

బుధవారం నాడు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానేనని ఆయన చెప్పారు.షర్మిలతో పాటు సీఎం జగన్ ను కలవడానికి వెళ్తున్నానన్నారు. అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదన్నారు. బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని ఆయన తెలిపారు.

also read:న్యూఢిల్లీకి వై.ఎస్. షర్మిల: కాంగ్రెస్‌లో చేరికకు ముహుర్తం ఫిక్స్

గత ఏడాదిలోనే  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి  ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి కూడ ఆయన రాజీనామా చేశారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డిని బుజ్జగించేందుకు వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైఎస్ఆర్‌సీపీ మంగళగిరి అసెంబ్లీ ఇంచార్జీ పదవిని  బీసీ సామాజిక వర్గానికి చెందిన  గంజి చిరంజీవికి  కట్టబెట్టింది ఆ పార్టీ నాయకత్వం. దీంతో పాటు ఇతరత్రా కారణాలతో వైఎస్ఆర్‌సీపీ  ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?

వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీ వై.ఎస్. షర్మిల విలీనం చేయనున్నారు. వై.ఎస్. షర్మిలతో పాటు తాను నడుస్తానని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇదివరకే  ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో  చేరేందుకు  వై.ఎస్. షర్మిల  ఇవాళ రాత్రికి  గన్నవరం నుండి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. వై.ఎస్. షర్మిలతో కలిసి ఆళ్ల రామకృష్ణా రెడ్డి  కూడ  ఢిల్లీకి వెళ్లనున్నారు.వై.ఎస్. షర్మిలతో పాటు  మరో 40 మంది కూడ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే వారిలో వైఎస్ఆర్‌సీపీ  ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఒకరు. భవిష్యత్తులో  వైఎస్ఆర్‌సీపీకి చెందిన అసంతృప్తులు కూడ  ఆ పార్టీని వీడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
 

***

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu