కేసీఆర్‌ను పరామర్శించనున్న జగన్: లంచ్ భేటీ, ఏం జరుగుతుంది?

By narsimha lode  |  First Published Jan 3, 2024, 1:10 PM IST


భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు.



అమరావతి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల  4వ తేదీన భేటీ కానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు గత నెల  8వ తేదీన హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ జరిగింది.ఈ సర్జరీ జరిగిన తర్వాత  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక  తన ఇంట్లో  విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరామర్శించనున్నారు జగన్.  కేసీఆర్ నివాసంలోనే  ఈ నెల  4వ తేదీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తిరిగి  తాడేపల్లికి చేరుకుంటారు. 

2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో  కల్వకుంట్ల తారక రామారావు  లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు.  అయితే మరోసారి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు  ముందే  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో  జగన్ భేటీ కావాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది. కేసీఆర్ ను పరామర్శించేందుకే జగన్  కేసీఆర్ తో భేటీ కానున్నారని  వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.అయితే రానున్న రోజుల్లో  రాజకీయ పరిణామాలపై ఈ ఇద్దరి నేతల మధ్య చర్చలు జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest Videos

undefined

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల  రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే రోజున జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో భేటీ కానున్నారు.  వైఎస్ఆర్‌సీపీ, భారత రాష్ట్ర సమితి పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు  దూరంగా ఉన్నాయి. 

also read:కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం: రాజ్యసభకు వై.ఎస్. షర్మిల

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి,  కేసీఆర్ ల మధ్య మంచి సంబంధాలున్నాయి. కేసీఆర్ ను ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  పరామర్శించారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే  జగన్ కు కేసీఆర్ పరామర్శించారు. 

click me!