ఆ విషయంలో అంబానీని సైతం ఎదిరిస్తా:పవన్ కళ్యాణ్ (వీడియో)

By Nagaraju TFirst Published Nov 26, 2018, 2:53 PM IST
Highlights

అన్నపూర్ణగా పిలవబడే తూర్పుగోదావరి జిల్లాలో కూడా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతుండటం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. 
 

అమలాపురం: అన్నపూర్ణగా పిలవబడే తూర్పుగోదావరి జిల్లాలో కూడా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతుండటం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. పంటలకు సాగునీరు సమయానికి అందక పోవడం వల్ల ఒకప్పుడు 3 పంటలు పండించే రైతు ప్రస్తుతం నీటి సమస్య వల్ల కేవలం 2 పంటలే పండిస్తున్నారని రైతులు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. 

ఓఎన్జీసీ, చమురు కోసం జరిపే భూగర్భ బాంబింగ్ వల్ల నీరు భూమి కాలుష్యం అయిపోయాయని పవన్ కళ్యాణ్ అన్నారు. చమురు తరలించడం వల్ల భూమి 3 అడుగులు కృంగిపోయిందని కొన్ని సంవత్సరాలకు కోనసీమ సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. 

జనసేన పార్టీ  అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రిలయన్స్, ఓఎన్ జీసీ సంస్థలు కోనసీమలో చమురు దోచుకుంటూ పంట భూములను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. చమురును దోచుకుంటున్నఅంబానీ సైతం నిలదీస్తానన్నారు. దేశాన్ని శాసించే ఎంత పెద్ద పారిశ్రామికవేత్తలు అయినా ఊరుకునేది లేదన్నారు. 

ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఎవరినైనా నిలదీసే దమ్ము ధైర్యం తనకు ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తుందని ప్రజలు ఆదరించాలని కోరారు. 

"

click me!