సమస్యలపై చేతులెత్తేసిన పవన్

First Published Dec 8, 2017, 12:02 PM IST
Highlights
  • సమస్యను పరిష్కారం చేయలేకపోయినా అర్ధం చేసుకుంటారట

సమస్యను పరిష్కారం చేయలేకపోయినా అర్ధం చేసుకుంటారట..విచిత్రంగా లేదూ సమాధానం. మిత్రపక్షంగా ఉన్న పవనేమో సమస్యలు పరిష్కరించలేరట. కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసిపి మాత్రం సమస్యల పరిష్కారం నుండి దూరంగా పారిపోతోందట. పైగా సమస్యల పరిష్కారానికి అద్బుతమైన వేదికైన అసెంబ్లీని బహిష్కరించటాన్ని పవన్ తప్పుపడుతున్నారు. అయితే, వైసిపి తాము అసెంబ్లీ సమావేశాలను ఎందుకు బహిష్కరిస్తున్నామో స్పష్టంగా చెప్పింది. మరి ఆ విషయాన్ని మాత్రం ఎందుకు పవన్ ప్రస్తావించటం లేదు. చంద్రబాబునాయుడును పవన్ ఎందుకు నిలదీయలేకపోతున్నారు? సమస్యలు పరిష్కరించని చంద్రబాబుది తప్పు కాదట. అసెంబ్లీని బహిష్కరించిన వైసిపిదే తప్పట. ఎలాగుంది పవన్ లాజిక్?

నిజానికి జనసేనానికి నోటమాట పడిపోయింది. ఎందుకంటే శుక్రవారం ఉదయం పవన్ ఫాతిమా కాలేజి విద్యార్ధులు, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో భేటీ అయ్యారు. అయితే, పవన్ ఏ ఉద్దేశ్యంతో వారితో భేటీ అయ్యారో తెలీదు కానీ వాళ్ళు మాత్రం పవన్ కు చుక్కలు చూపించారు. పవన్ భేటీ సాంతం ప్రభుత్వంపై ఫిర్యాదులతోనే సరిపోయింది. అదికూడా నేరుగా చంద్రబాబును ఉద్దేశించే ఫిర్యాదులు చేయటంతో పవన్ ఏమీ మాట్లాడలేకపోయారు. చంద్రబాబు ప్రభుత్వం వల్ల  జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తుంటే 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో ఏం చేసారంటూ పవన్ అడగటం విచిత్రంగా ఉంది.  పైగా ఎవరితో పవన్ మాట్లాడినా తిప్పి తిప్పి వైసిపిని తప్పు పట్టటంపైనే ప్రధానంగా దృష్టి పెట్టటం గమానార్హం.

చంద్రబాబునాయుడు,  వైద్యా ఆరోగ్య శాఖమంత్రి కామినేని శ్రీనివాస్ పై ఫాతిమా కళాశాల విద్యార్ధులు మండిపడ్డారు. చంద్రబాబు తమ సమస్యను పట్టుంచుకోవటం వల్లే తాము నష్టపోయినట్లు మండిపడ్డారు. వారితో పవన్ మాట్లాడుతూ, ప్రభుత్వంతో సమస్య పరిష్కారం గురించి మాట్లాడుతానన్నారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులతో మాట్లాడారు. వారికి నిర్దిష్టమైన హామీ ఇవ్వని పవన్ సమస్య పరిష్కారం గురించి అసెంబ్లీలో మాట్లాడకపోవటంపై వైసిపినే తప్పుపట్టారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై ఫిర్యాదులు చేసారు. వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

click me!