కమలదళంపై కాటమరాయుడి ఫైర్

Published : Dec 21, 2016, 11:13 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
కమలదళంపై కాటమరాయుడి ఫైర్

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి డైరెక్టుగానే బీజేపీ నేతలపై విరుచకపడ్డారు. ఏపీ బీజేపీ ఇంచార్జ్ తన పై చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ లో కడిగిపారేశారు.

 

వరస ట్వీట్లతో బీజేపీ పేరు ఎత్తకుండానే ఇన్ని రోజులు విమర్శలు ఎక్కుపెట్టిన పవన్ ఇప్పడు రూట్ మార్చాడు.

 

డైరెక్టుగా కమలదళాన్నే టార్గెట్ చేశారు. బీజేపీ ఏపీ ఇంచార్జ్  సిద్దార్థ్ సింగ్ పై పవన్ కల్యాణ్ ట్విటర్ లో విరుచకపడ్డారు.

 

 

ఎంతో రాజకీయ అనుభవం, రాజ్యాంగ కోవిధులున్న పార్టీ నుంచి వచ్చిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అత్యంత దారుణమైన తప్పిదమని ధ్వజమెత్తారు.

 

 

ఆ నిర్ణయం ఎంతో మంది జీవితాలను బలితీసుకుందని విమర్శించారు.

 

 

బీజేపీ నేతలు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అమాయక ప్రజలు బలైపోయారని ఆ వేదన వ్యక్తం చేశారు.

 

 

 

బీజేపీ నేతలు తనకు హితబోధ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఒక వేళ మీరేదైనా సలహాలు ఇవ్వాలంటే మీ సొంత పార్టీ వ్యక్తులు ఇవ్వండి అని సిద్ధార్థ్ సింగ్ కు సూచించారు.

 

PREV
click me!

Recommended Stories

Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా | Asianet News Telugu
Minister Nara Lokesh Speech: బాలయ్య డైలాగులతో రెచ్చిపోయిన నారాలోకేష్. ఇక సమరమే | Asianet News Telugu