వైఎస్ఆర్‌సీపీకి లీగల్ నోటీసు: పవన్ షాకింగ్ నిర్ణయం

Published : Aug 23, 2019, 10:51 AM ISTUpdated : Aug 23, 2019, 10:53 AM IST
వైఎస్ఆర్‌సీపీకి లీగల్ నోటీసు: పవన్ షాకింగ్ నిర్ణయం

సారాంశం

వైఎస్ఆర్‌సీపీ నేతలు ఉద్దేశ్యూర్వకంగా చేస్తున్న తప్పుడు  ప్రచారానికి చెక్ పెట్టాలని జనసేన నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై లీగల్ నోటీసు ఇవ్వనుంది.


అమరావతి: వైఎస్ఆర్‌సీపీపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయాలని జనసే నిర్ణయం తీసుకొంది. అంతేకాదు లీగల్ నోటీసులు కూడ ఇవ్వనున్నారు.సోషల్ మీడియా వేదికగా తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడంపై జనసేన ఈ నిర్ణయం తీసుకొంది.

వైఎస్ఆర్‌సీపీ కి చెందిన కొందరు సోషల్ మీడియాలో జనసేనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.ఈ విషయాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకొన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎండగట్టాలని కూడ నిర్ణయం తీసుకొంది. ఈ తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడ ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాదు తప్పుడు ప్రచారం చేసిన వైఎస్ఆర్‌సీపీ పై లీగల్ నోటీసులు కూడ పంపాలని  ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్  సీరియస్ గా ఉన్నట్టుగా  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం