పద్మ పురస్కారాలు ఎంపికైన తెలుగు వారికి పవన్ కల్యాణ్ అభినందనలు.. వారికి రావడం సంతోషం..

By SumaBala BukkaFirst Published Jan 26, 2023, 6:50 AM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో పద్మపురస్కారాలకు ఎంపికైన వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. 

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే పద్మ పురస్కారాలను మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి మొత్తంగా 12మంది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈసారి పద్మాపురంస్కారాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిదిమంది, తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వీరందరికీ అభినందనలు తెలుపుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ట్రీట్ చేశారు. పద్మ పురస్కారాలు స్వీకరిస్తున్న వారిలో రామచంద్ర మిషన్ తో సేవలందిస్తున్న ఆధ్యాత్మిక గురువు కమలేష్ డి పటేల్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి లు ఉండడం.. వీరిని పద్మ పురస్కారాలు వరించడం సంతోషకరమైన విషయమై పవన్ కళ్యాణ్ అన్నారు.

చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మికవేత్తగానే కాకుండా వేద విజ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.  నవతరానికి సమతా మూర్తి విగ్రహ స్థాపన ద్వారా  మంచి సందేశం ఇచ్చారని చెప్పారు. దీంతో పాటు‘జిమ్స్’ సంస్థల స్థాపించి విద్యా, వైద్య సేవలను  సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారని కొనియాడారు.

Padma awards: పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగువారు వీరే.. ఎవరికి ఏ పురస్కారమంటే..?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తెలుగు సినిమా పాటను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన  సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి  అభినందనలు తెలిపారు. వీరితోపాటు  డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్,  భాషా శాస్త్రవేత్త బి రామకృష్ణారెడ్డి లకు పద్మశ్రీ పురస్కారం దక్కడం ఆనందకరమైన విషయమని తెలిపారు.  సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ చంద్రశేఖర్  ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ  సంఘ సేవ చేస్తున్నారని తెలిపారు.

గిరిజన భాషలపై బి రామకృష్ణారెడ్డి చేసిన పరిశోధనలు… నిఘంటువుల రూపకల్పనలు చేయడం ఎంతో అమూల్యమైనవి అని తెలుపు చెప్పకు వచ్చారు. ఆయనకు పురస్కారం ఇవ్వడం భాషకు పురస్కారం ఇవ్వడమేనని పేర్కొన్నారు.  ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన అందరికీ ఆయన పేరుపేరునా అభినందనలు తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో ఇంకా సివి రాజు, డాక్టర్ పసుపులేటి హనుమంతరావు, అబ్బా రెడ్డి  నాగేశ్వరరావు,  కోట సచ్చిదానందమూర్తి, ఎం విజయ గుప్తాలు  ఉన్నారు. 

click me!