పోలీసులను ఇష్టానురాజ్యంగా వాడొద్దు.. ప్రాథమిక హక్కులనే కాలరాస్తే ఎలా?: పవన్ కల్యాణ్

By Sumanth Kanukula  |  First Published Jul 17, 2023, 2:49 PM IST

శ్రీకాళహస్తిలో జనసేన ప్రశాంతంగా ఆందోళన చేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే ప్రశాంతంగా ఆందోళన  చేస్తుంటే సీఐ చేయి చేసుకన్నారని విమర్శించారు. 


శ్రీకాళహస్తిలో జనసేన ప్రశాంతంగా ఆందోళన చేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే ప్రశాంతంగా ఆందోళన  చేస్తుంటే సీఐ చేయి చేసుకన్నారని విమర్శించారు. జనసైనికులు ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటారనే మచిలీపట్నం సభలో చూశామని తెలిపారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగలేదని  అన్నారు. జనసేన నేత సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై పవన్ కల్యాణ్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా ఉన్న తమ పార్టీ నాయకుడిపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. 

ఆ తర్వాత తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తాము క్రమశిక్షణతో ప్రశాంతంగానే నిరనసలు తెలుపుతామని.. పోలీసులను ప్రభుత్వం ఇష్టానురాజ్యంగా వాడొద్దని అన్నారు. తాము ప్రతిసారి పోలీసు శాఖకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామని చెప్పారు. పోలీసులకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి  ఉంటుందనేది ఒకస్థాయి వరకు తాము అర్థం చేసుకుంటామని.. కానీ ప్రాథమిక హక్కులనే ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇది క్షమాపణకు సంబంధించి కాదని.. వ్యవస్థకు సంబంధించినదని అన్నారు. ఈ ఘటనపై హెచ్‌ఆర్సీ స్పందించి సుమోటోగా స్వీకరించింది.. అందుకు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా పేర్కొన్నారు. 

Latest Videos

Also Read: సీఐ అంజూ యాదవ్‌పై తిరుపతి ఎస్పీకి పవన్ ఫిర్యాదు.. ఎస్పీ కార్యాలయానికి భారీగా జనసైనికులు..

click me!