
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ కన్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వందశాతం బెటరని సిపిఐ నాయకుడు నారాయణ అన్నారు. జగన్ బిజెపితో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆయన అన్నారు.
బిజెపితో పవన్ కల్యాణ్ కు ఏ విధమైన సంబంధాలు లేవని అన్నారు. అందుకే తాము పవన్ కల్యాణ్ తో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి దమ్ముంటే ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టాలని ఆయన అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కూడా కేసు పెట్టాలని ఆయన అన్నారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లను వామపక్షాలు ఎన్నటికీ సమర్థించబోవని అన్నారు.